భర్తతో కలిసి గణేశుడి ఆశీస్సులు తీసుకున్న ప్రముఖ హీరోయిన్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఫైర్.. కారణమిదే

చాలా మంది సెలబ్రిటీల్లాగే ఈ ప్రముక హీరోయిన్ కూడా ఇటీవల తన భర్త తో కలిసి గణపతి మండపానికి వెళ్లింది. అక్కడ వినాయకుడికి ప్రత్యేక ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే కొందరు నెటిజన్లు..

భర్తతో కలిసి గణేశుడి ఆశీస్సులు తీసుకున్న ప్రముఖ హీరోయిన్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఫైర్.. కారణమిదే
Bollywood Actress Swara Bhaskar

Updated on: Sep 07, 2025 | 8:57 AM

వినాయక చవితి వేడుకల్లో నిమజ్ఞనం కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకత ఉంది. చవితి వేడుకలను ఎంత అట్టహాసంగా నిర్వహిస్తారో నిమజ్జనం వేడుకలను కూడా అంతే ఘనంగా నిర్వహిస్తారు.ఈ క్రమంలో ఇన్ని రోజులు పూజలందుకున్న గణనాథులు ఒక్కొక్కటిగా గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. గణేశ్ ఉత్సవాలకు దేశంలో నే ప్రసిద్ధి గాంచిన ముంబైలో వినాయక నిమజ్జనం వేడుకలు ఎంతో ఉత్సాహంగా సాగుతున్నాయి. భక్తులు బరువెక్కిన హృదయాలతో వినాయకులను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు ఈ నేపథ్యంలో నిమజ్జనానికి ముందు సామాన్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా గణేశుడిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు చేసి దీవెనలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి స్వర భాస్కర్ కూడా గణపతి ఆశీస్సలు తీసుకుంది. ఆమె వెంట తన భర్త పాకీ ఫహద్ అహ్మద్, కూతురు కూడా ఉన్నారు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో, స్వర ఆకుపచ్చ చీరలో కనిపించింది. అలాగే భార్యా భర్తలు స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ వీడియోను షేర్ చేస్తూ,, ‘గణపతి బప్పా మోరియా, వచ్చే ఏడాది మళ్లీ కలుద్దాం….’ అని రాసుకొచ్చింది స్వర భాస్కర్.

ప్రస్తుతం స్వరా భాస్కర్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన చాలా మంది నెటిజన్లు పాజిటివ్ గానే స్పందించారు. అయితే కొందరు మాత్రం తీవ్ర అభ్యంతరం తెలిపారు. ముఖ్యంగా తన ముస్లిం భర్తతో కలిసి గణేశుడిని దర్శించుకోవడంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఇస్లాంలో విగ్రహాలను పూజించడం నిషిద్ధమని ఫహద్‌కు చెప్పండి…’ అంటూ సూచిస్తున్నారు. ఇదే సమయంలో చాలా మంది స్వరాకు మద్దతు పలుకుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటివి కేవలం మనదేశంలో మాత్రమే చూడగలం, వారు మత సామరస్యాన్ని చాటుకున్నారంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గణేశుడి ఆశీస్సులు తీసుకుంటోన్న స్వరా భాస్కర్ ఫ్యామిలీ..

స్వర భాస్కర్, ఫహద్ అహ్మద్ 2023 లో కోర్టులో వివాహం చేసుకున్నారు. ఇప్పుడీ దంపతులకు ఒక కుమార్తె ఉంది. ఆ అమ్మాయికి రబియా అని పేరు పెట్టారు. నటి ఎప్పుడూ తన కుమార్తెతో ఉన్న ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంది. అందుకే ఈ అందాల తారకు నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదీ అందాల తార.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.