Anushka Sharma: జీవితాన్ని ఆస్వాదించాలంటే పోటీ నుంచి తప్పుకోవాల్సిందే.. పెళ్లి తర్వాత జీవితంపై అనుష్క కామెంట్స్‌..

|

May 19, 2022 | 7:42 AM

Anushka Sharma: ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా ఓ వెలుగు వెలిగారు నటి అనుష్క శర్మ. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో నిత్యం బిజీగా గడిపిన అనుష్క విరాట్‌ కోహ్లీతో వివాహం తర్వాత సినిమాల్లో వేగాన్ని తగ్గించారు. అడపాదడపా తప్ప పెద్దగా సినిమాల్లో నటించడం లేదు...

Anushka Sharma: జీవితాన్ని ఆస్వాదించాలంటే పోటీ నుంచి తప్పుకోవాల్సిందే.. పెళ్లి తర్వాత జీవితంపై అనుష్క కామెంట్స్‌..
Follow us on

Anushka Sharma: ఒకప్పుడు బాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా ఓ వెలుగు వెలిగారు నటి అనుష్క శర్మ. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో నిత్యం బిజీగా గడిపిన అనుష్క విరాట్‌ కోహ్లీతో వివాహం తర్వాత సినిమాల్లో వేగాన్ని తగ్గించారు. అడపాదడపా తప్ప పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ సమయాన్ని కేటాయిస్తోంది. ఇక వామికకు జన్మనిచ్చిన తర్వాత అనుష్క సినిమాలకు మరింత దూరమైంది. కేవలం నటనకే కాకుండా నిర్మాణ సంస్థ స్లేట్జ్‌ నుంచి కూడా తప్పుకున్నారు. ఇకపై సినిమాలు నిర్మించబోనని తెలిపారు అనుష్క. అయితే తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని తాజాగా మీడియాతో పంచుకున్నారు.

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ.. ‘సినిమా రంగం అంటేనే నిత్యం విపరీతమైన పోటీతో కూడుకుంది. ఈ పరుగులకు అంతం అనేది లేదు. కానీ జీవితాన్ని ఆస్వాదించాలంటే ఏదో ఒక సమయంలో ఈ పోటీ నుంచి తప్పుకోవాల్సిందే. లేదంటే వ్యక్తిగత జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. పెళ్లి అయ్యాక వృత్తే జీవితం కాదనే విషయాన్ని తెలుసుకున్నాను. గృహిణిగా, నటిగా రెండు బాధ్యతలను బ్యాలెన్స్‌ చేయడం కష్టంతో కూడుకున్న పని. దీనిని అందరూ అందరూ అర్థం చేసుకోలేరు. నిర్మాణ సంస్థ నుంచి తప్పుకోవడానికి కూడా ఇదే కారణం. నటిగా కూడా పరిమితంగానే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పుకొచ్చింది అనుష్క. ఇదిలా ఉంటే అనుష్క ప్రస్తుతం టీమిండియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్‌’ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..