Sri Sri Ravi Shankar Biopic: రవిశంకర్ గురూజీ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

సిద్ధార్థ్ ఆనంద్ నిర్మిస్తున్న రవిశంకర్ గురూజీ బయోపిక్‌లో ఓ స్టార్ హీరో ప్రధాన పాత్ర పోషించనున్నాడు. రవిశంకర్ జీవితంలోని ఆసక్తికరమైన, స్ఫూర్తినిచ్చే అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, ఆగస్టులో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాత చెప్పాడు.

Sri Sri Ravi Shankar Biopic: రవిశంకర్ గురూజీ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Sri Sri Ravi Shankar Biopic

Updated on: Jul 12, 2025 | 7:21 AM

బాలీవుడ్‌లో ఎన్నో యాక్షన్ సినిమాలు అందించిన సిద్ధార్థ్ ఆనంద్ ఇప్పుడు బయోపిక్ తీయడంపై దృష్టి సారించారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ జీవిత కథను తెరపైకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో 12th ఫెయిల్ మూవీతో ఫేమస్ అయిన విక్రాంత్ మాస్సే రవిశంకర్ పాత్రలో కనిపించనున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో శాంతిని తీసుకురావడానికి రవిశంకర్ గురూజీ చాలా కృషి చేశారు. నేను ఆయన పాత్రను పోషించడం సంతోషంగా ఉంది. దీనిని ఒక పెద్ద బాధ్యతగా కూడా తీసుకుంటాను. కొలంబియాలో ప్రపంచ శాంతిని పునరుద్ధరించడంలో రవిశంకర్ గురూజీ చేసిన కృషి గురించి భారతదేశంలోని చాలా మందికి తెలియకపోవడం దురదృష్టకరం. ఈ చిత్రం ద్వారా మేము ఆ విషయాలను చెబుతున్నాము. ఆయన పాత్రను పోషించడం గౌరవంగా ఉంది. నేను ఎప్పటికీ ఆయనలా ఉండలేను. కానీ నేను ఆయనలా ఉండటానికి ప్రయత్నించగలను. ఆయన ప్రయత్నాల మాదిరిగానే నా ప్రయత్నాలూ నిజాయితీగా ఉండాలని నేను ఆశిస్తున్నాను” అని విక్రాంత్ చెప్పుకొచ్చాడు.

విక్రాంత్ మాస్సే గత సంవత్సరం శ్రీ శ్రీని కలిశారు. ఆ సమావేశం ఆయనపై వ్యక్తిగతంగా ప్రభావం చూపింది. ” రవిశంకర్ తో గడిపిన ప్రతి క్షణం నా జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. ఆగస్టులో షూటింగ్ ప్రారంభమవుతుంది’అని హీరో తెలిపాడు.

ఇవి కూడా చదవండి

విక్రాంత్ సినిమాలు ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. ఈ క్రమంలోనే. ’12 th ఫెయిల్’ సినిమాలో నటించడం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు . విక్రాంత్ ‘డాన్ 3’, ‘రామాయణం’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు.

రవిశంకర్ గురూజీతో బాలీవుడ్ నటుడు విక్రాంత్

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..