
బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ ఇప్పుడు మళ్లీ విన్నింగ్ ట్రాక్‌లోకి వచ్చాడు. గతేడాది గదర్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత సన్నీ డియోల్ డిమాండ్ మరింత పెరిగింది. దీంతో ఇప్పుడు అతడికి అవకాశాలు క్యూ కట్టాయి. నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్న రామాయణం సినిమాలో సన్నీడియోల్ కు మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో నటించేందుకు సన్నీ డియోల్ అంగీకరించినట్లు పింక్‌విల్లా నివేదించింది . ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో మాత్రం భారీ హైప్ నెలకొంది. మరోవైపు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉపయోగించి రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి ఎలా ఉంటారు ? అంటూ ఫోటోస్ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో న్యూస్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం.. రామాయణ సినిమా చాలా భాగాలుగా రూపొందించనున్నారట.. ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి.. రావణుడిగా యష్ నటించనున్నారని టాక్ నడుస్తుంది. అలాగే ఇప్పుడు హనుమంతుడిగా సన్నీ డియోల్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆంజనేయుడి పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ పాత్రకు నటీనటులు ఎంపిక విషయంలో చిత్రయూనిట్ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే విభీషణుడి పాత్ర కోసం విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
పాన్ ఇండియా లెవల్లో రెడీ అవుతున్న ‘రామాయణం’ సినిమా మొదటి భాగంలో ఆంజనేయ పాత్ర కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపించనుంది. ఆ తర్వాత భాగాల్లో మాత్రం ఈ పాత్రకు ఎక్కువ స్పేస్ ఉండనున్నట్లు తెలుస్తోంది. నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. మరికొన్ని నెలల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది.
EXCLUSIVE: #SunnyDeol locked to play Lord #Hanuman in #NiteshTiwari’s #Ramayana with #RanbirKapoor as Lord Ram, #SaiPallavi as #Sita and #Yash as #Ravana – Detailed Report! https://t.co/RaOhRF9tQw
— Himesh (@HimeshMankad) January 27, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.