Akshay Kumar: సినిమా ప్రమోషన్లలో గుట్కా యాడ్ గురించి అడిగిన జర్నలిస్ట్.. ఈ స్టార్ హీరో చేసిన పనికి అంతా షాక్

సుభాష్ కపూర్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా వహించిన ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 3' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

Akshay Kumar: సినిమా ప్రమోషన్లలో గుట్కా యాడ్ గురించి అడిగిన జర్నలిస్ట్.. ఈ స్టార్ హీరో చేసిన పనికి అంతా షాక్
Akshay Kumar

Updated on: Sep 12, 2025 | 7:57 PM

అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేయడంలో అక్షయ్ కుమార్ తర్వాతే ఎవరైనా . ఏడాదికి కనీసం 4-5 సినిమాలు రిలీజ్ చేస్తుంటాడీ స్టార్ హీరో. అలా 2025లో అక్షయ్ కుమార్ నటించిన ‘స్కై ఫోర్స్’, ‘కేసరి: చాప్టర్ 2’, ‘హౌస్‌ఫుల్ 5’ సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు అతను హీరోగా నటించిన మరో చిత్రం ‘జాలీ ఎల్‌ఎల్‌బి 3’ కూడా విడుదల కానుంది. ఇటీవల, ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ కు తాను నటించిన పాన్ మసాలా యాడ్ గురించి ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి అతను స్పందించిన తీరు ఇప్పుడు నెట్టంట తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అక్షయ్ కుమార్ గతంలో పాన్ మసాలా ప్రకటనలో నటించాడు. దీనిని చాలా మంది వ్యతిరేకించారు. తన సినిమాల్లో సామాజిక సందేశాలు ఇచ్చే ఇచ్చే అక్షయ్ కుమార్ గుట్కా ప్రకటనలో నటించడం సరైనది కాదని చాలా మంది ఈ హీరోపై మండిపడ్డారు. నిజ జీవితంలో అక్షయ్ కుమార్ చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అని, గుట్కా ప్రకటనలో కనిపించాల్సిన అవసరం ఎందుకొచ్చిందో తెలియదని ట్రోల్ చేశారు. అక్షయ్ కుమార్‌కు కూడా పలు సందర్భాల్లో ఈ యాడ్ పై ప్రశ్నలు ఎదురువుతూనే ఉన్నాయి.

‘జాలీ ఎల్ఎల్బీ 3’ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా, ఒక జర్నలిస్ట్ గుట్కా అంశాన్ని మళ్లీ లేవనెత్తాడు. దీనిపై స్పందించిన అక్షయ్ కుమార్ ‘ పొగాకు ప్ర‌మాద‌క‌రం, క్యాన్స‌ర్ కార‌కం! అని కూడా చెప్పుకొచ్చాడు. అయితే జర్నలిస్టులు మళ్ళీ అదే విషయం పై ప్రశ్నలు అడగడంతో ఈ స్టార్ హీరోకు చిర్రెత్తుకొచ్చింది. ఒకానొక స‌మ‌యంలో సహనం కోల్పోయిన అక్కీ.. ‘ఇది నా ఇంట‌ర్వ్యూనా? మీ ఇంట‌ర్వ్యూనా?’ అంటూ జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

జాలీ ఎల్ఎల్బీ 3′ సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఇందులో అక్షయ్ కుమార్ తో పాటు అర్షద్ వార్సీ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సౌరభ్ శుక్లా, హుమా ఖురేషి తదితరులు వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ఈమూవీ ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది. కోర్టు రూమ్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.