Aamir Khan: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అమీర్ ఖాన్ కూతురు.. ప్రియుడితో ఐరా ఖాన్ వివాహం.. వీడియో వైరల్..

ఐరాఖాన్, నూపుర్ ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరిద్దరు తమ తల్లిదండ్రులతో కలిసి అధికారిక వివాహ పత్రాలపై సంతకం చేశారు. ఈ వేడుకకు అమీర్ ఖాన్ మీజా భార్యలు రీనా దత్త, కిరణ్ రావు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్, నీతా అంబానీ దంపతులు, ఇతర కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు. వివాహం అనంతం అదే హోటల్లో రిసెప్షన్ జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Aamir Khan: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన అమీర్ ఖాన్ కూతురు.. ప్రియుడితో ఐరా ఖాన్ వివాహం.. వీడియో వైరల్..
Ira Khan Wedding

Updated on: Jan 04, 2024 | 8:09 AM

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ముంబైలోని బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‏లో తన ప్రియుడు ఫిట్‏నెస్ ట్రైనర్ నూపుర్ శిఖరేతో ఐరా వివాహం గ్రాండ్‏గా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబసభ్యులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు హజరయ్యారు. ఐరాఖాన్, నూపుర్ ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరిద్దరు తమ తల్లిదండ్రులతో కలిసి అధికారిక వివాహ పత్రాలపై సంతకం చేశారు. ఈ వేడుకకు అమీర్ ఖాన్ మీజా భార్యలు రీనా దత్త, కిరణ్ రావు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్, నీతా అంబానీ దంపతులు, ఇతర కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు. వివాహం అనంతం అదే హోటల్లో రిసెప్షన్ జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

అమీర్ ఖాన్ కూతురు వివాహం సంప్రదాయా పెళ్లికి భిన్నంగా జరిగింది. వరుడు గుర్రంపై ఆచారంగా గ్రాండ్ గా బరాత్ తో వివాహ మండపానికి రావాల్సింది. కానీ నూపూర్ మాత్రం దాదాపు 8 కిలోమీటర్లు జాగింగ్ చేస్తూ వివాహ వేడుక వద్దకు చేరుకున్నాడు. జాగింగ్ దుస్తుల్లోనే ఐరాను వివాహం చేసుకున్నాడు. గతేడాదిసెప్టెంబర్‌లో ఈ జంట ఇటలీలో నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లికి ముందు ఇటీవల ముంబైలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి.

అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ ‘మెంటల్ హెల్త్ సపోర్ట్ ఆర్గనైజేషన్’ సంస్థ వ్యవస్థాపకురాలు. ఎప్పుడూ మానసిక ఆరోగ్యానికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. కొన్నేళ్లుగా అమీర్ ఖాన్ కు నూపుర్ వ్యక్తిగత ఫిట్ నెస్ ట్రైలర్. అతడి వద్దే ఐరా సైతం ఫిట్ నెస్ ట్రైనింగ్ తీసుకుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరి వివాహం మరోసారి ఈనెల 8న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరగనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.