మేకప్ ఆర్టిస్ట్‌‌‌కి అవార్డు ఇవ్వాల్సిందే.. అచ్చం ఇందిరాగాంధీలా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

|

Aug 05, 2021 | 5:59 PM

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం బెల్ బాటమ్. రంజిత్‌ ఎం.తివారీ దర్శకత్వంలో వషు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్‌శిక్షా దేశ్‌ముఖ్‌, మోనిషా..

మేకప్ ఆర్టిస్ట్‌‌‌కి అవార్డు ఇవ్వాల్సిందే.. అచ్చం ఇందిరాగాంధీలా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
Follow us on

Bell Bottom: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం బెల్ బాటమ్. రంజిత్‌ ఎం.తివారీ దర్శకత్వంలో వషు భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్‌శిక్షా దేశ్‌ముఖ్‌, మోనిషా అద్వానీ, మధు బోజ్వానీ, నిఖిల్‌ అద్వానీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 1980లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఇందులో అక్షయ్ రా ఏజెంట్‌‌‌‌గా కనిపించనున్నారు. ఇందులో వాణీ కపూర్, హ్యూమా ఖురేషి, లారా దత్తా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్ర కూడా ఉందని తెలుస్తుంది. ఇందిరా గాంధీ పాత్రలో లారా దత్తా నటిస్తున్నారు. ఈ సినిమాకోసం లారా పూర్తిగా ఇందిరాగాంధీలా మారిపోయారు. ఏమాత్రం గుర్తుపట్టలేనంతగా అచ్చం ఇందిరాగాంధీలా ఉన్నారు లారా.

ఇటీవల విడుదల చేసిన ఆమె పోస్టర్ విపరీతంగా వైరల్ అవుతోంది. బెల్ బాటమ్ ట్రైలర్ చూసినవారందరూ లారా దత్తా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆమె ఇందిరాగాంధీ పాత్రకోసం వేసుకున్న మేకప్ కు సంబంధించి ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ పాత్ర కోసం లారా దత్త పడ్డ కష్టం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమెను అచ్చం ఇందిరా గాంధీలా మార్చిన మేకప్ ఆర్టిస్ట్‌‌‌కి అవార్డు ఇవ్వాలని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక యాక్షన్ చిత్రాలతో పేరు పొందిన అక్షయ్ కుమార్ బెల్ బాటమ్‌‌‌తో మరో హిట్ అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాతో పాటు ‘పృథ్వీరాజ్’  ‘బచ్చన్ పాండే’ ఇంకా ‘రామ్ సేతు’ సినిమాలు చేస్తున్నాడు అక్షయ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో సురేఖ వాణి.. క్లూ ఇచ్చిన నటి.. అందుకే పోస్ట్‌‌‌‌‌ను డిలీట్ చేశారా..?

Raj Kundra: రాజ్ కుంద్రా చెప్పింది ఒక్కటి చేసింది మరొకటి.. పోర్న్ కేసులో బాధితురాలి సంచలన వ్యాఖ్యలు

Kiara Advani : బాలీవుడ్ యంగ్ హీరోతో కియారా అద్వానీ ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ..