ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరాముని ఆలయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది హిందువులు నూతన సంవత్సరంలోని 22 జనవరి కోసం ఎదురుచూస్తున్నారు. రామమందిర ప్రారంభాన్ని రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. రామ మందిరాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించనున్నారు. ఈ ప్రత్యేకమైన రోజు కోసం అనేక రకాలుగా సన్నాహాలు చేస్తున్నారు. శాంతి భద్రతలతో పాటు భక్తులకు సౌకర్యాల కల్పన, మతపరమైన కార్యక్రమాలపై పూర్తి దృష్టి సారిస్తున్నారు. ఈ వేడుకలో రాజకీయ నాయకులు సినీ ప్రముఖుల సహా అనేక మంది పాల్గొననున్నారు.
2024 జనవరి 22వ తేదీన జరిగే రామమందిరం ప్రారంభోత్సవంలో పాల్గొనమంటూ పలువురు బాలీవుడ్ తారలకు ప్రత్యేక ఆహ్వానాలను పంపించారు. బాలీవుడ్ పరిశ్రమతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి కూడా అనేక మంది స్టార్ నటీనటులు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగం అవుతారాని తెలుస్తోంది. అయితే మొదటి జాబితా బయటకు వచ్చిన సమయంలో కేవలం ఐదుగురు బాలీవుడ్ తారల పేర్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఇపుడు దక్షిణ సినీ పరిశ్రమతో పాటు బాలీవుడ్ కి చెందిన మొత్తం 18 మంది సెలబ్రిటీలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో కంగనా రనౌత్ పేరు లేకపోవడం విశేషం.
నివేదిక ప్రకారం సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సహా అనేక మంది సూపర్‌స్టార్లు రామమందిరం ప్రారంభోత్సవ వేడుకకు హాజరు అవ్వమంటూ ఆహ్వానం అందుకున్నారు. మాధురీ దీక్షిత్ కూడా రామమందిరం ప్రారంభోత్సవ వేడుక హాజరయ్యే అతిధిగా ఎంపికైంది. జనవరి 22న జరగనున్న రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న గౌరవనీయ అతిథుల్లో బాలీవుడ్ మెగాస్టార్ అక్షయ్ కుమార్ పేరు కూడా ఉంది. ‘పద్మావత్’, ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ వంటి చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కూడా రామాలయ ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది.
ఈ గ్రాండ్ ఈవెంట్‌లో భాగం కావాల్సిందిగా ‘డింకీ’ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీకి కూడా ఆహ్వానం అందింది. రోహిత్ శెట్టితో పాటు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కూడా రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలని రామ మందిర నిర్మాణ ట్రస్ట్ ఆహ్వానించింది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..