బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాత, బాలాజీ టెలీ ఫిలిమ్స్ అధినేత్రి ఏక్తాకపూర్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఓ వెబ్‌సిరీస్ విషయంలో కోర్టు ఆదేశాలు ధిక్కరించినందుకు గానూ బిహార్ లోని బెగుసరాయ్ జిల్లా కోర్టు ఏక్తాతో పాటు ఆమె తల్లి శోభా కపూర్‌కు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. బాలాజీ టెలీఫిల్మ్స్ కంపెనీ నిర్మాణ సారథ్యంలో గతంలో XXX పేరుతో ఓ వెబ్‌సిరీస్ తెరకెక్కింది. దీనిని ఏక్తా సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏఎల్‌టీ బాలాజీలో స్ట్రీమింగ్ చేశారు. మొదటి సీజన్ 2018 లో, రెండవది 2020 జనవరిలో ప్రసారమైంది. దీనిని తన సొంత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏఎల్‌టీ బాలాజీలో స్ట్రీమింగ్ చేసింది. మొదటి సీజన్ 2018 లో, రెండవది 2020 జనవరిలో ప్రసారమైంది. కాగా ఈ వెబ్ సిరీస్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శంబు కుమార్ అనే ఓ మాజీ సైనికోద్యోగి బిహార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సిరీస్‌లో అడల్ట్ కంటెంట్ ఉందని, సైనికుల భార్యలను అసభ్యంగా చూపించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సైనికోద్యోగుల కుటుంబాల సెంటిమెంట్లను దెబ్బ తీసేలా ఈ సిరీస్ ఉందని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని శంభుకుమార్ కోరాడు.
కాగా శంభు ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఏక్తాకపూర్, ఆమె తల్లి శోభా కపూర్లకు కోర్టు నోటీసులు ఇచ్చింది. కాగా ఈ ఫిర్యాదు తర్వాత వెబ్ సిరీస్‌లో అభ్యంతరకరంగా ఉన్న పలు సన్నివేశాలు తొలగించారు. అయితే వారు కోర్టు ఆదేశాలని దిక్కరించారని, నోటిసులు అందినప్పటికీ ఏక్తా కపూర్, ఆమె తల్లి కోర్టుకు హాజరు కాకుండా బాధ్యత రహితంగా వ్యవహరించారని శంభు కుమార్ తరపు న్యాయవాది హ్రిషికేశ్ పతక్ తెలిపారు. ఈ కారణంగానే తల్లీకూతుళ్లపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఆయన తెలిపారు. కాగా ఏఎల్‌టీ బాలాజీ ఓటీటీ సంస్థ వ్యవహారాలను ఏక్తాతో పాటు తల్లి శోభాకపూర్ సంయుక్తంగా చూసుకుంటున్నారు. ఈ కారణంగానే తల్లీకూతుళ్లకు అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..