సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు అర్జిత్ సింగ్(Arijit Singh). తన అద్భుతమైన గాత్రంతో సినీ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. సింప్లిసిటికీ కేరాఫ్ అడ్రస్. కేవలం గానంతోనే కాదు.. తన మంచి మనసుతో శ్రోతలకు చేరువయ్యాడు ఈ సింగర్. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌తో బీటౌన్ ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ సింగర్.. ఇప్పుడు తన సొంత గ్రామంలోని పిల్లల కోసం మరో ముందగుడు వేశారు. స్వస్థలంలోని పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించే బాధ్యతను తీసుకున్నాడు. పేద విద్యార్థుల కోసం ఉచిత ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం తన స్వస్థలంలోని ఓ నర్సింగ్ కళాశాలను ఎంచుకున్నాడు. అక్కడ ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్లిన అర్జిత్ కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. భారీగా తరలివచ్చి గాయకుడిని చుట్టుముట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అర్జిత్ సింగ్ స్వస్థలం అయిన ముర్షిదాబాద్‌లోని జియాగంజ్‌లోని స్థానికంగా ఉన్న నర్సింగ్ కాలేజీలో ఉచిత ఇంగ్లీష్ కోచింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందులోని గదులను అద్దెకు తీసుకోవడానికి.. ఆ పరిసరాలను పరిశీలించేందుకు సింగర్ అర్జిత్ ఎంతో సామాన్యుడిగా స్కూటీపై కళాశాలకు చేరుకున్నాడు. దీంతో అతడిని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టారు. ఇంగ్లీష్ ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి గదులు ఖాళీగా ఉన్నాయా అని అర్జిత్ అడిగారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్ నిర్వహించనున్నట్లు చెప్పారు. దీంతో అతనికి స్థలం ఇచ్చేందుకు నేను ఓకే చెప్పాను. ఇంగ్లీష్ పరిజ్ఞానం, సాహిత్యం, ఇంగ్లీష్ కేంద్రాల కొరత ఉంది. అర్జిత్ నిర్ణయంతో పిల్లలకు మంచి జరుగుతుందని సదరు కళాశాల అధ్యాపకుడు శంకర్ మోండల్ తెలిపారు.
#ArijitSingh visits Nursing college simplicity of Arijit Singh . #ArijitSingh intends to start free English Coaching Centre at his Home Town Murshidabad. He was there at the Local Nursing college to see rooms on lease. pic.twitter.com/msmTzdpbOO
— Pk (@Prajwalk202000) August 15, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.