Subrata Roy Biopic: సిల్వర్‌ స్క్రీన్‌పై సహారా ఛైర్మన్‌ జీవితం.. సుబ్రతారాయ్‌గా ఎవరు నటిస్తున్నారంటే?

ఇంటింటికి తిరుగుతూ డొక్కు స్కూటర్‌ మీద మిర్చీ బజ్జీలు అమ్ముకునే సుబ్రతా రాయ్ లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు. ఇటుక ఇటుక పేర్చి కట్టిన అతని కార్పొరేట్‌ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది? ఇలా ఒక సినిమా కథకు సరిపోయే అంశాలన్నీ సుబ్రతా రాయ్ జీవితంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సహారా చైర్మన్‌ బయోపిక్ తీయడానికి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Subrata Roy Biopic: సిల్వర్‌ స్క్రీన్‌పై సహారా ఛైర్మన్‌ జీవితం.. సుబ్రతారాయ్‌గా ఎవరు నటిస్తున్నారంటే?
Subrata Roy

Updated on: Nov 24, 2023 | 8:36 PM

సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ ఇటీవలే కన్నుమూశారు. ప్రపంచ వ్యాపార రంగంలో సుబ్రతా రాయ్ ఒక సంచలనం. ఇంటింటికి తిరుగుతూ డొక్కు స్కూటర్‌ మీద మిర్చీ బజ్జీలు అమ్ముకునే సుబ్రతా రాయ్ లక్షల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు. ఇటుక ఇటుక పేర్చి కట్టిన అతని కార్పొరేట్‌ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది? ఇలా ఒక సినిమా కథకు సరిపోయే అంశాలన్నీ సుబ్రతా రాయ్ జీవితంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సహారా చైర్మన్‌ బయోపిక్ తీయడానికి చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది మొదట్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు నిర్మాతలు చెబుతున్నారు. అదే సమయంలో, ఈ చిత్రంలో నటింపచేసేందుకు గానూ అనిల్ కపూర్, బొమన్ ఇరానీ అనే ఇద్దరు బాలీవుడ్ తారల పేర్లను పరిశీలిస్తున్నారు. అనిల్‌ కపూర్‌ ఈ మూవీపై ఆసక్తిని చూపించాడని, టీమ్‌తో చాలాసార్లు చర్చించాడని కూడా నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌కి ఆయన ఇంకా ఓకే చెప్పలేదని తెలుస్తోంది. రాయ్ జీవితంలోని వివాదాస్పద అంశాల కారణంగా అతను ఈ పాత్రలో నటించడానికి వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే ఈ సినిమాకు ఓకే చెబుతారని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తెర పైకి అనిల్ కపూర్, బొమన్ ఇరానీల పేర్లు..

వాస్తవానికి సుబ్రతా రాయ్‌ బయోపిక్‌ షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభించాలని నిర్మాతలు అనుకుంటున్నారు. రాయ్ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయని చెబుతున్నారు. ‘ సుబ్రతా రాయ్ జీవితాన్ని తెరపై చూపించేందుకు సన్నాహాలు చూపిస్తున్నాం. అయితే ఒక యువ నటుడితో రాయ్‌ జీవితాన్ని చూపించడం సరైనది కాదు. అనిల్ కపూర్‌తో పాటు బోమన్ ఇరానీ పేరు కూడా మేకర్స్ మనసులో ఉంది. అనిల్ కపూర్ ఈ సినిమా చేయడానికి నిరాకరించినప్పుడు మాత్రమే అతను బొమన్‌ను సంప్రదించే యోచనలో మేకర్స్‌ ఉన్నట్లు బాలీవుడ్‌ మీడియా సర్కిళ్లలో టాక్‌ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరణానికి ముందే బయోపిక్ కు ప్రయత్నాలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.