Ananya Pandey: ఆ హీరోతో రెండేళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పేసిందా ?.. వైరలవుతున్న అనన్య ఇన్ స్టా పోస్ట్..

|

Apr 10, 2024 | 6:13 PM

ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అనన్య పాండే, అదిత్య బ్రేకప్ పై సర్వత్రా చర్చ జరుగుతుంది. రెండేళ్లలోనే వీరి ప్రేమాయణం ముగిసిందని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు కారణం అనన్య తన ఇన్ స్టాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్. నిజంగా నీది అయితే తప్పక నీ వద్దకు వస్తుంది.. లేదంటే ఎప్పటికీ నువ్వు పొందలేవు అంటూ ఇంగ్లీష్ కోట్ షేర్ చేసింది. దీంతో వీరి బ్రేకప్ రూమర్స్ తెరపైకి వచ్చాయి.

Ananya Pandey: ఆ హీరోతో రెండేళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పేసిందా ?.. వైరలవుతున్న అనన్య ఇన్ స్టా పోస్ట్..
Ananya, Aditya
Follow us on

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఫాంలో ఉన్న హీరోయిన్లలో అనన్య పాండే ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈబ్యూటీ.. నిత్యం ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తుంటుంది. సినిమాలు లేదా వ్యక్తిగత విషయాలతో నెట్టింట ఆమె పేరు మారుమోగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‏తో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. చాలారోజులుగా వీరిద్దరు కలిసి ఈవెంట్స్, రెస్టారెంట్స్, పార్టీలలో కనిపిస్తున్నారు. దీంతో వీరి డేటింగ్ నిజమే అంటున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరు విడిపోయారంటూ బీటౌన్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అనన్య పాండే, అదిత్య బ్రేకప్ పై సర్వత్రా చర్చ జరుగుతుంది. రెండేళ్లలోనే వీరి ప్రేమాయణం ముగిసిందని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు కారణం అనన్య తన ఇన్ స్టాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్. నిజంగా నీది అయితే తప్పక నీ వద్దకు వస్తుంది.. లేదంటే ఎప్పటికీ నువ్వు పొందలేవు అంటూ ఇంగ్లీష్ కోట్ షేర్ చేసింది. దీంతో వీరి బ్రేకప్ రూమర్స్ తెరపైకి వచ్చాయి.

“అది నిజంగా నీదే అయితే అది నీకు తిరిగి వస్తుంది. మీరు దాని నుంచి ఎంత దూరం నెట్టివేసినా తిరిగి మీవద్దకే వస్తుంది. అన్నీ సొంతంగా నేర్చుకోవాలనే పాఠాన్ని మీకు మిగుల్చుతుంది. కొన్ని వస్తువులు చాలా అందంగా ఉంటాయి కానీ అవి మీవి కావు ” అంటూ ఓ కోట్ షేర్ చేసింది అనన్య. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. దీంతో అనన్య, ఆదిత్య ప్రేమ బ్రేకప్ జరిగిందా అన్న ప్రశ్న తలెత్తింది. అనన్య పోస్ట్ పై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నాయి.

Ananya Pandey

అనన్య పాండే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ సినిమాతో సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ ఆశించినంతగా ఆకట్టుకోలేదు. అనన్య చివరగా ఖో గయే హమ్ కహాన్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

source

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.