Amitabh Gifted A Car: గత 10 ఏళ్ల నుంచి రోడ్డుమీద గుంతలను పూడుస్తున్న వృద్ధ జంట.. కారు గిఫ్ట్ ఇచ్చిన అమితాబ్

| Edited By: Surya Kala

Jul 11, 2021 | 5:06 PM

Amitabh Gifted A Car: రోడ్లమీద గుంతల వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటుంటే.. మరికొందరు అవయవాలను పోగొట్టుకుంటున్నారు...

Amitabh Gifted A Car: గత 10 ఏళ్ల నుంచి రోడ్డుమీద గుంతలను పూడుస్తున్న వృద్ధ జంట.. కారు గిఫ్ట్ ఇచ్చిన అమితాబ్
Amitabh Gifted A Car
Follow us on

Amitabh Gifted A Car: రోడ్లమీద గుంతల వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటుంటే.. మరికొందరు అవయవాలను పోగొట్టుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ కు చెందిన ఓ వృద్ధ జంట అలాంటి ప్రమాదాలనుంచి వాహనదారులను రక్షించాలనే ఉద్దేశ్యంతో నగరంలోని గుంతలను నింపుతున్నారు. ఇలా గత 11 సంవత్సరాలుగా గుంతల వల్ల జరిగే ప్రమాదాల నుండి ప్రజలను రక్షించడానికి ఈ జంట తమ సొంత డబ్బుని ఉపయోగిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌కు చెందిన 73 ఏళ్ల గంగాధర్ తిలక్ ‘రోడ్ డాక్టర్ ‘ గా ప్రసిద్ది చెందారు. గంగాధర్ తిలక్ తన భార్య వెంకటేశ్వరి (64)తో కలిసి ఒక కారులో రోడ్లపైకి వస్తారు.. దానిని ‘గుంతల అంబులెన్స్’ అని పిలుస్తారు. అలా కారులో రోడ్డు మీద గుంత కనిపిస్తే అక్కడ ఆ గుంతను నింపుతారు.

మొదట తాను గుంతలు కారణంగా రోడ్లపై అనేక ప్రమాదాలను నివారణించడానికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. “మొదట్లో, నేను ఈ సమస్య గురించి పోలీసులకు , మునిసిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాను, కానీ ఏదీ ప్రయోజనం లేదు. ఆ సమయంలోనే ఈ గుంతలను స్వయంగా నింపాలని నిర్ణయించుకున్నాను” అని గంగాధర్ తిలక్ చెప్పారు.

తిలక్ ఇండియా రైల్వేలో 35 సంవత్సరాలు ఉద్యోగిగా పనిచేశారు. పదవీ విరమణ తరువాత తిలక్ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ డిజైన్ ఇంజనీర్‌గా పనిచేయడానికి హైదరాబాద్ వచ్చారు . అతను అప్పటి నుండి నగరం అంతటా గుంతలను నింపుతున్నాడు. రహదారులను గుంతలు లేకుండా చేయాలనే ఉత్సాహంతో, అతను ఒక సంవత్సరంలోనే సాఫ్ట్‌వేర్ డిజైన్ ఇంజనీర్‌గా తన ఉద్యోగాన్ని విడిచ పెట్టారు. అప్పటి నుండి భాగ్యనగరంలోని గుంతలను నింపడానికి పూర్తిగా అంకితభావంతో భార్యాభర్తలు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 2030 గుంతలను తిలక్‌ దంపతులు పూడ్చారు. ఒక్కోగుంత పూడ్చడానికి 2వేల రూపాయల వరకూ ఖర్చు అవుతోంది. తన ఫించన్‌ డబ్బులనే ఉపయోగించి తిలక్‌ స్వచ్ఛందంగా ఈ పని చేస్తున్నారు. తిలక్‌ చేస్తున్న సామాజిక సేవకు మెచ్చి బిగ్‌బి అమితాబ్‌ ఓ కారును వారికి బహుమతిగా ఇచ్చారు.

Also Read:  : రెగ్యులర్ వంటలతో బోరు కొడుతుందా.. రెస్టారెంట్ స్టైల్ లో స్పైసీ చిల్లీ చికెన్ తయారు చేసి చూడండి