Pushpa Moive: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .. ‘పుష్ప’ మూవీ క్రిస్మస్ కానుకగా రిలీజై.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో అల్లు అర్జున్ ‘పుష్ప’ 2021 ఏడాదిలో రిలీజైన సినిమాల్లో భారీ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. అంతేకాదు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది పుష్ప.
అల్లు అర్జున హీరోగా తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా పుష్ప తెరకెక్కింది. రిలీజైన అన్ని భాషల్లోనూ రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. దక్షిణాదిలో భారీగా రిలీజైన పుష్ప మూవీ ఫస్ట్ వీక్ లోనే దాదాపు రూ. 165 కోట్లు రాబట్టింది.
అయితే పుష్ప మూవీకి హిందీ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. హిందీ ప్రేక్షకులను పుష్ప.. పుష్ప రాజ్ అంటూ బన్నీ ఆకట్టుకున్నాడు. దీంతో థర్డ్ వీక్ లో కూడా బీ టౌన్ లో పుష్పకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు సరిగా మెల్లగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన 83 సినిమాను బీట్ చేస్తూ భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇప్పుడు పుష్ప హిందీ వెర్షన్ లో 56 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
#PushpaHindi is in no mood to stop ??
A nett collection of 6.1 Cr yesterday (Saturday) taking the total collections to 56.69 Cr for the Hindi version of #PushpaTheRise.#SensationalPushpaHindi ?@alluarjun @iamRashmika @aryasukku @MythriOfficial @GTelefilms @AAFilmsIndia pic.twitter.com/dUyLgzRK7K
— Pushpa (@PushpaMovie) January 2, 2022
పుష్ప హిందీలో రెండు వారాల్లో దాదాపు 47 కోట్ల బిజినెస్ చేయగా.. మూడవ వారాంతంలో మొదటి రోజు 3.50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో ఇప్పటి వరకూ పుష్ప హిందీ వెర్షన్ కు ఇప్పటి వరకు 50.59 కోట్ల రూపాయలను రాబట్టింది. రాబోయే వారంలో ఈ వసూళ్లు మరింతగా పెరగనున్నాయని తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
అల్లు అర్జున్ చిత్రం ‘పుష్ప’ 17 డిసెంబర్ 2021న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాపై ఇప్పటికీ విపరీతమైన బజ్ ఉంది. ఈ సినిమా విడుదలైన తొలిరోజే హిందీలో రూ.3 కోట్ల బిజినెస్ చేసింది. హిందీలో 6 రోజుల్లో దాదాపు 23.23 కోట్ల బిజినెస్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా అంతకు మించి వసూళ్లు సాధిస్తోంది. పుష్ప రాజ్తగా అల్లు అర్జున అద్భుతమైన నటన.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యం ఈ విజయానికి ప్రముఖ పాత్ర వహించిందని అంటున్నారు.
అల్లు అర్జున్ పుష్ప హిందీ వెర్షన్‌కి ఈ వసూళ్లు మంచి ఫీట్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. వాస్తవానికి పుష్ప చిత్ర యూనిట్ హిందీ వెర్షన్ కు ప్రచారం పై దృష్టి పెట్టలేదు.. అయినప్పటికీ అక్కడ పుష్ప అనూహ్యంగా మంచి వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికీ మహారాష్ట్రలో 50 శాతం థియేటర్లకు మాత్రమే అనుమతి ఉంది. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్ ‘పుష్ప’ రూ.50 కోట్లకు పైగా వసూలు చేయడం నిజంగా గ్రేట్ అని అంటున్నారు.
Also Read: మీరు కొత్త ఇల్లు లేదా స్థలం కొనాలనుకుంటున్నారా.. ఈ 5 వాస్తు చిట్కాలను తప్పనిసరిగా పాటించండి..