
Brahmastra Pre Release: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt). ఆ చిత్రంలో చెర్రీ సరసన సీత పాత్రలో ఆమె నటన అందరినీ ఆకట్టకుంది. కొన్ని రోజుల క్రితం డార్లింగ్స్ సినిమాతో మెప్పించిన ఈ అందాల తార మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. తన భర్త, చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) తో కలిసి ఆమె నటించిన బ్రహ్మాస్త్ర (తెలుగులో బ్రహ్మాస్త్రం). అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాను దక్షిణాదిన రాజమౌళి సమర్పిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్9న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా ఈ ఈవెంట్‌లో అలియా, రణ్‌బీర్ లిద్దరూ తెలుగులో మాట్లాడి అలరించారు.
ఇదే వేదికగా తెలుగులోనూ పాట పాడి ఆకట్టుకుంది అలియా. తన ఉపన్యాసాన్ని పాటతో ముగిస్తానంటూ చెబుతూ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలోని కేసరియా పాటను తెలుగులో ఆలపించింది. ఈ సందర్భంగా అలియా స్టేజ్ మీద పాట పాడుతుంటే వెనకాల కూర్చున్న రణ్‌బీర్ చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. అలాగే ఎన్టీఆర్, రాజమౌళి, కరణ్ జోహార్ తో పలువురు చప్పట్లు కొడుతూ ఆర్‌ఆర్ఆర్ బ్యూటీని ప్రోత్సహించారు. సాంగ్ పూర్తయిన తర్వాత అందరూ ఆమెను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..