Alia Bhatt Pregnant: గుడ్ న్యూస్ షేర్ చేసిన సీత.. తల్లి కాబోతున్న అలియా భట్.. నెట్టింట ఫోటోస్ వైరల్..

|

Jun 27, 2022 | 11:47 AM

దీంతో అలియా దంపతులకు బాలీవుడ్ సెలబ్రెటీస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్, అలియా గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి

Alia Bhatt Pregnant: గుడ్ న్యూస్ షేర్ చేసిన సీత.. తల్లి కాబోతున్న అలియా భట్.. నెట్టింట ఫోటోస్ వైరల్..
Alia Bhatt Ranbir
Follow us on

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సోషల్ మీడియాలో శుభవార్త పంచుకుంది.. తాను తల్లికాబోతున్నట్లు వెల్లడించింది. త్వరలోనే తమ బిడ్డ రాబోతుందంటూ ఆసుపత్రిలో స్కానింగ్ ఫోటోస్ షేర్ చేసింది.. అలియా పక్కనే రణబీర్ కపూర్ సైతం ఉన్నట్లు తెలుస్తోంది.. దీంతో అలియా దంపతులకు బాలీవుడ్ సెలబ్రెటీస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్, అలియా గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 14న వీరిద్ధరి వివాహం ఘనంగా జరిగింది..

ఇటీవల వీరిద్దరు ప్రధాన పాత్రలలో బ్రహ్మస్త్రం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‏తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వహిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని శివ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 2022 సెప్టెంబర్ 9న హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ కీలకపాత్రలలో నటిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున సైతం మరో ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.