Akshay Kumar: మరో సినిమా మొదలుపెట్టిన అక్షయ్ కుమార్.. శివుడి గెటప్‌లో యాక్షన్ హీరో..

|

Oct 23, 2021 | 7:05 PM

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం పెద్ద విషయం కాదు.. మహా అయితే రెండు లేదా మూడు సినిమాలు.. కానీ ఏడాదికి 5,6 సినిమాలు చేయడం అనేది..

Akshay Kumar: మరో సినిమా మొదలుపెట్టిన అక్షయ్ కుమార్.. శివుడి గెటప్‌లో యాక్షన్ హీరో..
Akshay Kumar
Follow us on

Akshay Kumar: బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం పెద్ద విషయం కాదు.. మహా అయితే రెండు లేదా మూడు సినిమాలు.. కానీ ఏడాదికి 5,6 సినిమాలు చేయడం అనేది మన దగ్గర ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి సాధ్యం అయ్యింది. అయితే బాలీవుడ్ లో ఆ రికార్డు ను మాత్రం తన ఖాతాలో ఎప్పుడో వేసుకున్నారు అక్షయ్ కుమార్. గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం.. పెద్ద దర్శకుడా..లేక చిన్న దర్శకుడా అని తేడా లేకుండా కథని నమ్మి సినిమాలు చేయడం అక్షయ్ స్టైల్. ఈ యాక్షన్ హీరో సినిమాలకు భారీ కలక్షన్స్ కూడా దక్కుతుంటాయి.. అలాగే అక్షయ్ రెమ్యునరేషన్ కూడా అలానే ఉంటుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అక్షయ్ వరుస సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటీవల ‘బెల్ బాటమ్’  అనే సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా తర్వాత ఇప్పుడు అక్షయ్ చేతిలో ఏకంగా ఎనిమిది సినిమాలు ఉన్నాయి.

‘సూర్యవంశీ’ ‘అత్రాంగి రే’ ‘పృథ్వీరాజ్’ ‘రక్షా బంధన్’ ‘రామ్ సేతు’ ‘మిషన్ సిండ్రెల్లా’ ‘గూర్ఖా’ వంటి సినిమాల్లో నటిస్తున్నాడు అక్షయ్. ఈక్రమంలో తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ ఖిలాడీ హీరో. గతంలో అక్షయ్  ఓ మై గాడ్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మనదగ్గర ఈ సినిమాను గోపాల గోపాల అనే టైటిల్ తో రీమేక్ చేశారు. ఈ రీమేక్ లో పవన్ కళ్యాణ్- వెంకటేష్ కలిసి నటించారు. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మై గాడ్ 2 పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అక్షయ్ కుమార్ శివుడి గెటప్ లో కనిపిస్తున్నారు. ఓ స్కూల్ పిల్లాడిని కూడా చూడొచ్చు. ఇక ఈ సినిమాకు అమిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ ను షేర్ చేసిన అక్షయ్.. ‘ఈ జర్నీలో అందరినీ ఆ ఆదియోగి ఆశీర్వదిస్తాడు. హర హర మహదేవ్’ అని అక్షయ్ రాసుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral News: బీహార్‌లో హాట్ టాపిక్‌గా మారిన నటుడు రామిరెడ్డి.. తెలుగు దివంగత నటుడు అక్కడ ఎందుకనేగా..

RK Selvamani: దర్శకుడు సెల్వమణి బర్త్ డే వేడుకలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్..

Mahesh Babu: సర్కారు వారి పాటకు శేఖర్‌ మాస్టర్‌ స్టెప్పులు.. సినిమా సెట్‌లో దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ..