ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించిన పుష్ప చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి చెప్పక్కర్లేదు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. పాన్ ఇండియా లెవల్లో విడుదలై భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతోపాటు.. ఇందులోని సాంగ్స్ సైతం యూట్యూబ్‌ను షేక్ చేశాయి. ముఖ్యంగా ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ గురించి తెలిసిందే. ఈ పాటకు నెటిజన్స్.. సెలబ్రెటీస్ డాన్స్ చేసి అదుర్స్ అనిపించారు. తాజాగా ఊ అంటవా పాటకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. హీరోయిన్ నోరా ఫతేహి సైతం ఈ పాటకు అందంగా డాన్స్ చేసి మైమరపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.
ఇటీవల డల్లాస్‌లో జరిగిన ది ఎంటర్టైన్మెంట్స్ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, దిశా పటానీ, మౌనీ రాయ్, సోనమ్ బజ్వా, నోరా ఫతేహి, అయుష్మాన్ ఖురానా, స్టెబిన్ బెన్ వంటి తారలు పాల్గొన్నారు. ఈ వేడుకలు మార్చి 3న యూఎస్ లోని అట్లాంటాలో ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఈవెంట్లో అక్షయ్ కుమార్, నోరా ఫతేహి తమ డాన్స్ తో నెటిజన్లను ఆకట్టుకున్నారు.
పుష్ప చిత్రంలోని ఊ అంటవా మావ.. ఊహు అంటవా.. పాటకు తమ స్టైల్లో డాన్స్ చేసి అదుర్స్ అనిపించారు. ఒరిజినల్ పాటలో సమంత, అల్లు అర్జున్ కలిసి వేసిన స్టెప్పులను స్టేజ్ పై రిపీట్ చేశారు అక్షయ్, నోరా. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు వీరిద్దరి డ్సాన్స్ పై ప్రశంసలు కురిపిస్తుండగా..మరికొందరు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.