Prithviraj Movie: రేపు రిలీజ్ కానున్న పృథ్వీరాజ్ మూవీ.. టాక్స్ ఫ్రీ ప్రకటించిన యూపీ సర్కార్

'పృథ్వీరాజ్' మూవీ జూన్ 3న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాపై కువైట్‌లో నిషేధం విధించినట్లు మరోవైపు టాక్ వినిపిస్తోంది. ట్రేడ్ అనలిస్ట్ గిరీష్ జోహార్ ఈ విషయాన్ని ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు.

Prithviraj Movie: రేపు రిలీజ్ కానున్న పృథ్వీరాజ్ మూవీ.. టాక్స్ ఫ్రీ ప్రకటించిన యూపీ సర్కార్
'samrat Prithviraj Movie
Follow us
Surya Kala

|

Updated on: Jun 02, 2022 | 4:37 PM

Prithviraj Movie: అక్షయ్ కుమార్, మానుషి చిల్లర్ జంటగా నటించిన హిస్టారికల్ మూవీ ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ రేపు అంటే జూన్ 3న విడుదల కానుంది. ఈ చారిత్రాత్మిక సినిమాకు యూపీ సర్కార్ టాక్స్ ఫ్రీ ప్రకటించింది. అవును  యోగి ప్రభుత్వం రాష్ట్రంలో ఈ చిత్రానికి పన్నునుంచి మినహాయింపునిచ్చింది. పృథ్వీరాజ్ చిత్రాన్ని ప్రతి ఒక్కరి చెంతకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు సీఎం యోగి తెలిపారు. ‘ఉత్తరప్రదేశ్‌లో చక్రవర్తి పృథ్వీరాజ్‌కు పన్ను మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తద్వారా ఈ చిత్రాన్ని సామాన్యుడు కూడా చూసే వీలుకలుతుంది.

‘పృథ్వీరాజ్’ మూవీ జూన్ 3న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాపై కువైట్‌లో నిషేధం విధించినట్లు మరోవైపు టాక్ వినిపిస్తోంది. ట్రేడ్ అనలిస్ట్ గిరీష్ జోహార్ ఈ విషయాన్ని ట్వీట్టర్ ద్వారా ప్రకటించారు. ‘ఒమన్ ప్రభుత్వం.. కువైట్ లో అక్షయ్ కుమార్, మానుషి చిల్లార్ నటించిన ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ చిత్రంపై నిషేధం విధించింది. ఈ సినిమా ఇక్కడ విడుదల కాదని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

అయితే అక్షయ్ కుమార్ తాజా సినిమా ‘పృథ్వీరాజ్’  వివాదంలోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు, అక్షయ్ కుమార్ సినిమా పేరు కారణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఇంతకు ముందు అక్షయ్ సినిమా పేరు పై కర్ణి సేన దీనిపై నిరసన వ్యక్తం చేసింది. తర్వాత చిత్ర యూనిట్ ఈ చిత్రానికి ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ అని పేరు పెట్టారు.

పృథ్వీరాజ్ చౌహాన్ చక్రవర్తి వీరోచిత కథను తెలియజేస్తూ.. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన అక్షయ్ కుమార్ చిత్రానికి చాంద్ బర్దాయి రాసిన ప్రసిద్ధ పద్య పృథ్వీరాజ్ రాసో ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ,  మానుషి చిల్లార్‌తో పాటు, సోనూ సూద్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా మానుషి చిల్లార్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. మానుషి ఈ  సినిమా రిలీజ్ పై చాలా ఎగ్జైట్‌గా ఎదురుచూస్తుంది. మానుషీ తన మొదటి చిత్రం పృథ్వీరాజ్ లో రాణి సంయోగితగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు , టీజర్-ట్రైలర్లతో అభిమానులకు దగ్గర చేసింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి