Aishwarya Rai: ఐశ్వర్య రాయ్, అభిషేక్‌లపై విడాకుల రూమర్స్.. ఒక్క ఫొటోతో అందరి నోళ్లు మూయించారుగా!
గత కొన్ని రోజులుగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ల వైవాహిక బంధంపై రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఈ అందమైన జంట త్వరలోనే విడాకులు తీసుకోనున్నారని, ఇప్పటికే వేర్వేరుగా ఉంటున్నారని ప్రచారం సాగింది. దీనికి తోడు అటు ఐష్ కానీ, అభిషేక్ కానీ ఈ వార్తలపై స్పందించకపోవడం బ్రేకప్ రూమర్స్ కు బలం చేకూరినట్లయింది

గత కొన్ని రోజులుగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ల వైవాహిక బంధంపై రూమర్లు వస్తూనే ఉన్నాయి. ఈ అందమైన జంట త్వరలోనే విడాకులు తీసుకోనున్నారని, ఇప్పటికే వేర్వేరుగా ఉంటున్నారని ప్రచారం సాగింది. దీనికి తోడు అటు ఐష్ కానీ, అభిషేక్ కానీ ఈ వార్తలపై స్పందించకపోవడం బ్రేకప్ రూమర్స్ కు బలం చేకూరినట్లయింది. అయితే అభిషేక్, ఐశ్వర్య రాయ్ మాత్రం విడాకుల రూమర్ల గురించి అసలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఆ మధ్యన ప్రో కబడ్డీ లీగ్ లో జంటగా కనిపించి విడాకుల రూమర్లకు చెక్ పెట్టారు. అలాగే పలు సందర్భాల్లో జోడీగా తమపై వస్తోన్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పుడు గాసిప్ రాయుళ్ల నోళ్లను మూయించేస్తూ తమ పెళ్లి రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. శనివారం (ఏప్రిల్20) తో ఐష్, అభిషేక్ లు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి 17 ఏళ్లు పూర్తయ్యాయి. తన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశాడు అభిషేక్. ఇందులో కూతురు ఆరాధ్య కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్‌లకు అభిమానులు, సన్నిహితులు, ప్రముఖులు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మరి ఈ ఫోటో అయినా చూశాక గాసిపర్ల నోళ్లకు తాళం పడుతుందేమో చూడాలి. ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2007లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఐశ్వర్యరాయ్ 2011లో ఆడపిల్ల (ఆరాధ్య)కి జన్మనిచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. పొన్నియన్ సెల్వన్ సిరీస్ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య రాయ్. ఇందులో ఆమె అందం, అభినయానికి అందరూ ఫిదా అయ్యారు. తన తర్వాతి సినిమా గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఇక అభిషేక్ కూడా వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు.
భర్త, కూతురితో ఐశ్వర్య రాయ్..
View this post on Instagram
ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్ లో బచ్చన్ ఫ్యామిలీ.. వీడియో
.@SrBachchan, @juniorbachchan & #AishwaryaRaiBachchan were all in attendance to watch the #JaipurPinkPanthers win their 1st game of the Mumbai leg! 🤩
Tune-in to #PUNvCHE in #PKLOnStarSports Tomorrow, 7:30 PM onwards | Star Sports Network#HarSaansMeinKabaddi pic.twitter.com/lUE0ksnU8r
— Star Sports (@StarSportsIndia) January 6, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




