Adipurush: భాషతో సంబంధం లేకుండా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఆది పురుష్ చిత్రం. బాహుబలి తర్వాత ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ప్రభాస్‌కు బాలీవుడ్‌లో వచ్చిన ఫేమ్‌ను ఉపయోగించుకునే క్రమంలో దర్శకుడు ఓంరౌత్ ఈ సినిమాను దేశంలోని దాదాపు అన్ని భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు ఈ సినిమాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామయాణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇలా భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిత్రీకరణ జరుగుతోన్న కొద్ది మరి కొంత మంది నటీనటులు వచ్చి చేరుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మంబయిలోని స్టూడియోలో జరుగుతోన్న ఆదిపురుష్ షూటింగ్‌లో ప్రముఖ హిందీ టీవీ ఆర్టిస్టు, హీరో వత్సల్ సేథ్ జాయిన్ అయ్యారు. ఈ సినిమాలో వత్సల్ ముఖ్యమైన పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. వత్సల్ బాలీవుడ్‌లో పలు సీరియళ్లతో పాటు టార్జాన్ ది వండర్ కార్, సల్మాణ్ జైహో, మలాంగ్ వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. ఇక తాను ఆదిపురుష్‌లో నటిస్తున్నట్లు వత్సల్ స్వయంగా తానే తెలిపారు. ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. ‘‘కొత్త ఆరంభం’.. అనే క్యాప్షన్‌తో పాటు ‘ఆదిపురుష్’ హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. మరి వత్సల్‌ను రామయణంలోని ఏ పాత్ర కోసం తీసుకున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
New Beginnings #Adipurush ?@omraut pic.twitter.com/dHFwHQe9hO
— Vatsal Sheth (@shethvatsal) July 15, 2021
Also Read: Khanamet lands: నిన్న కోట్లు కురిపించిన కోకాపేట భూములు.. ఇవాళ ఖానామెట్ భూముల ఈ-వేలం
Araku Valley Train Journey: హమ్మయ్య..! అరకు అందాల రైలు.. మళ్లీ వచ్చింది