Yami Gautham: హీరోయిన్ యామీ గౌతమ్‏కు షాకిచ్చిన ఈడీ.. మనీలాండరింగ్ ఆరోపణలతో నోటీసులు.. స్టేట్‏మెంట్ ఇవ్వాలని..

|

Jul 02, 2021 | 3:47 PM

Yami Gautham: బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్‏కు ఈడీ షాకిచ్చింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘించినట్లు ఈడీ ఆరోపణలు నమోదు చేసింది.

Yami Gautham: హీరోయిన్ యామీ గౌతమ్‏కు షాకిచ్చిన ఈడీ.. మనీలాండరింగ్ ఆరోపణలతో నోటీసులు.. స్టేట్‏మెంట్ ఇవ్వాలని..
Yami Gautham
Follow us on

Yami Gautham: బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్‏కు ఈడీ షాకిచ్చింది. విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘించినట్లు ఈడీ ఆరోపణలు నమోదు చేసింది. దీంతో మనీలాండరింగ్ ఆరోపణల కింద ఈడీ ఆమెకు గురువారం సమన్లు జారీ చేసింది. ఆర్థిక అవకతవలకలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆమె స్టేట్‏మెంట్ రికార్డ్ చేయడానికి వచ్చేవారం ఈడీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే యామీ గౌతమ్ ఈడీ నుంచి సమన్లు అందుకోగా.. ఇది రెండవసారి..

ఇదిలా ఉంటే.. ఇటీవల కరోనా విపత్కర సమయంలో కుటుంబసభ్యులు.. అతి తక్కువ మంది స్నేహితుల ముందు చిత్ర నిర్మాత ఆదిత్యా ధార్‏ను వివాహం చేసుకుంది యామీ గౌతమ్. విక్కీ డోనర్ సినిమాతో బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన యామీ.. హృతిక్ రోషన్ సరసన కాబిల్, వరుణ్ ధావన్ నటించిన బద్లాపూర్ సహా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇటు సినిమాల్లో మాత్రమే కాకుండా.. పలు బ్యూటీ ప్రొడక్ట్స్‏కు యామీ గౌతమ్ బ్రాండ్ అంబాసిడర్‏గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఓ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది.

ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా యామీ గౌతమ్ సుపరిచితురాలు. టాలీవుడ్ లో నువ్విలా, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈడీ.. బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రాలపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. మనీలాండరింగ్ ఆరోపణలతో ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటీనటులను, ఇతర ప్రముఖులను ఈడీ విచారించినట్లుగా సమాచారం.

Also Read: Union Minister on farm laws: కొత్త సాగు చట్టాలపై కేంద్ర మంత్రి తోమర్ కీలక వ్యాఖ్యలు.. శరద్ పవార్ సూచనలు పరిగణంలోకి తీసుకుంటామని స్పష్టం

Darbhanga blast case: మీరు కూడా టెర్రర్ కుట్రలో ఇరుక్కోవచ్చు.. జర భద్రం..! దర్భాంగ కేసులో చిక్కుకున్న ఓ సామాన్యుడు..

Assam Rifles Recruitment: క్రీడానేపథ్యం ఉండి టెన్త్ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అస్సోం రైఫిల్స్ నోటిఫికేషన్