Yami Gautam: ఆ వ్యాధితో భాదపడుతున్నాను.. ఒప్పుకోవడానికే చాలా సంవత్సరాలు పట్టింది.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్..

యామీ గౌతమ్.. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు. హీరోయిన్ కంటే ముందుగానే  బ్యూటీ యాడ్ ద్వారా

Yami Gautam: ఆ వ్యాధితో భాదపడుతున్నాను.. ఒప్పుకోవడానికే చాలా సంవత్సరాలు పట్టింది.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్..
Yami Gautham

Updated on: Dec 28, 2021 | 8:03 AM

యామీ గౌతమ్.. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరు. హీరోయిన్ కంటే ముందుగానే  బ్యూటీ యాడ్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది యామీ గౌతమ్. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోయింది యామీ గౌతమ్. విక్కీ డౌనార్, సనమ్ రే, బద్ లా పూర్, కాబిల్, ఉరి వంటి చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నితిన్ ప్రధాన పాత్రలో నటించిన కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల తన వ్యక్తిగత విషయం గురించి తెలియజేసి అందరిని షాక్‏కు గురిచేసింది యామీ గౌతమ్.

యుక్త వయసు నుంచి తను కెరాటోసిస్ పిలారిస్ అనే చర్మ వ్యాధితో బాధపడుతున్నట్లుగా తన సోషల్ మీడియాలో ఖాతాలో వెల్లడించింది యామీ గౌతమ్. ఇటీవల ఎలాంటి ఎడిట్ చేయని తన ఫోస్ట్ చేసి ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చింది హీరోయిన్. “చాలా సంవత్సరాలుగా ఉన్న భయం.. అభద్రతా భావాలను ఈరోజు విడిచిపెట్టాలని అనుకుంటున్నాను. నా లోపాలను మనస్పూర్తిగా అంగీకరించే దైర్యం నాకు వచ్చింది. ఈ నిజాన్ని మీతో పంచుకునే దైర్యం వచ్చింది. ఎరుపు రంగులో ఉండే నా జుట్టుకు రంగు వేయడం.. కంటి కింద చారలను స్మూత్ నింగ్ చేయాలని నాకు అనిపించట్లేదు. అయినా నేను అందంగనే ఉన్నా” అంటూ షేర్ చేసింది యామీ గౌతమ్.

ఈ పోస్ట్ రాయడం కష్టంగా లేదు.. ఇదే విముక్తి కలిగిస్తుంది. నా పరిస్థితి గురించి తెలిసినప్పటినుంచి నేను పోస్ట్ పెట్టే వరకు నా ప్రయాణం ఓ సవాలుగా మారింది. ప్రజలు నన్ను షూటింగ్ లో చూసినప్పుడు బ్రష్ ఎలా చేయాలి. కనపడకుండా ఎలా దాచాలి అంటూ మాట్లాడేవారు. అది నన్ను చాలా బాధించింది. నిజాన్ని అంగీకరించడానికి.. నా విశ్వసాన్ని పెంపొందించుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు ఈ పోస్ట్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి సంతోషపడ్డాను అంటూ యామీ గౌతమ్ తెలిపింది.

యామీ గౌతమ్ చివరిసారిగా భూత్ పోలీస్ చిత్రంలో కనిపించింది. ఇందులో అర్జున్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ఏడాదిలో ఉరి దర్శకుడు ఆదిత్య ధర్‏ను వివాహం చేసుకుంది యామీ గౌతమ్.

Also Read: RRR Movie: తారక్‌ ప్రేమను తట్టుకోవడం కష్టం, చరణ్‌లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. జక్కన్న ఆసక్తికర విషయాలు..

Mahesh Babu: దుబాయ్‌లో భీమ్లా నాయక్ టీమ్‌ని కలిసిన మహేష్ బాబు.. వర్క్ అండ్ చిల్ అంటూ ఫోటో షేర్ చేసిన ప్రిన్స్..

Singer Mangli: మంగ్లీకి సెల్పీల సెగ.. ఎగబడిన జనం.. ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్…

Upasana Konidela: గోల్డెన్ వీసా అందుకున్న మెగా కోడలు.. ఇక పై గ్లోబల్ సిటిజన్‏గా గుర్తింపు.. సంతోషంలో ఉపాసన..