Taapsee Pannu: ‘మేము ముర్ఖులం కాదు, ఊరికే సహనం కోల్పోవడానికి’.. కెమెరామెన్లతో గొడవపై స్పందించిన తాప్సీ..

|

Aug 17, 2022 | 7:59 AM

ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కెమెరామెన్లతో తాప్సీ గొడవ పడిన సంగతి తెలసిందే. ఫోటోల కోసం వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. తాను కేవలం ఈవెంట్ నిర్వాహకుల సూచనలు పాటిస్తున్నానని

Taapsee Pannu: మేము ముర్ఖులం కాదు, ఊరికే సహనం కోల్పోవడానికి.. కెమెరామెన్లతో గొడవపై స్పందించిన తాప్సీ..
Taapsee
Follow us on

ప్రస్తుతం బాలీవుడ్ చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది హీరోయిన్ తాప్సీ పన్నూ (Taapsee Pannu). ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం దొబెరా చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కెమెరామెన్లతో తాప్సీ గొడవ పడిన సంగతి తెలసిందే. ఫోటోల కోసం వీరిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. తాను కేవలం ఈవెంట్ నిర్వాహకుల సూచనలు పాటిస్తున్నానని చెప్పింది. తనపై అరవకండి అంటూ సహనం కోల్పోయి చేతులు జోడించి వేడుకుంది తాప్సీ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో తాప్సీ పై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తే… మరికొందరు ఆమెకు మద్దతు తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న తాప్సీ కెమెరామెన్లతో జరిగిన గొడవపై స్పందించింది.

తాప్సీ మాట్లాడుతూ.. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లు తనతో అసభ్యంగా ప్రవర్తించారన.. కారణం లేకుండా తనపై అరవడం నచ్చలేదని చెప్పింది. తన తల్లిదండ్రులు కూడా అలా గట్టిగా తనపై అరవరు అని.. కానీ ఫోటోగ్రాఫర్స్ తనపై అరిచారని తెలిపింది. నటీనటులు మూర్ఖులు కాదని.. కారణం లేకుండా వీడియోలో తమ సహనం కోల్పోవడానికి వారు చదువుకోని వారు కాదంటూ చెప్పుకొచ్చింది. తాను ఎవరితోనూ ఆగౌరవంగా ప్రవర్తించలేదని.. ఫోటోగ్రాఫర్లు తనను గౌరవించకుండా అసభ్యంగా మాట్లాడుతున్న ప్రశాంతంగా ఉన్నానని.. చిరునవ్వుతోనే వారికి సమాధానమిచ్చాను అని అన్నారు. ఫోటోగ్రాఫర్స్ తనతో చాలా అవమానకరంగా మాట్లాడారని.. అతనితో గొడవ దిగడం ఇష్టం లేదు అందుకే చేతులు జోడించినట్లు చెప్పింది. తాను కేవలం పబ్లిక్ ఫిగర్ అని.. పబ్లిక్ ప్రాపర్టీ కాదని చెప్పుకొచ్చింది తాప్సీ. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన దొబెరా చిత్రం ఆగస్ట్ 19న విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.