Sunny Leone: షూటింగ్లో గాయపడిన సన్నీలియోన్.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన హీరోయిన్..
తన తదుపరి సినిమా షూటింగ్ సెట్ లో గాయపడింది బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ తన తదుపరి ప్రాజెక్ట్ చీత్రకరణలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఆమె సెట్స్ లో గాయపడింది. దీంతో ఆమె బొటనవేలు స్కిన్ తెగి రక్తస్రావం అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో దెబ్బ చూడటానికి చిన్నగానే ఉన్నా.. ఫస్ట్ ఎడ్ చేసేప్పుడు నొప్పి ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. గాయన్ని నెమ్మదిగా క్లీన్ చేయండి అంటూ వారిపై కేకలు వేసింది .. ఇంజెక్షన్ లాంటివి వద్దంటూ వారిని వారించింది. ఆయితే ఆమె గెటప్ చూస్తుంటే తదుపరి మూవీలో సన్నీ లియోన్ ఢీగ్లామర్ పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవల మంచు విష్ణు నటించిన జిన్నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సన్నీ లియోన్. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ సన్నీకి మాత్రం వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఐదారు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సన్నీ లియోన్ షేర్ చేసిన వీడియో చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆమెకు ఏం కాలేదని.. ధైర్యంగా ఉండాలని చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం సన్నీ లియోన్ కొటేషన్ గ్యాంగ్ యాక్షన్ చిత్రంలో నటిస్తోంది. క్రైమ్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇందులో సన్నీతోపాటు.. జాకీ ష్రాఫ్, సారా అర్జున్, ప్రియమణి నటిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.