Raj Kundra : శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ కు కారణం ఆమేనా.. అసలు విషయం ఏంటంటే..

| Edited By: Rajeev Rayala

Jul 20, 2021 | 12:11 PM

Raj Kundra Arrested : బాలీవుడ్ లో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ పెద్ద దుమారాన్నే రేపుతోంది. నీలిచిత్రాలను నిర్మించి పలు యాప్ లలో అప్ లోడ్ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు.

Raj Kundra : శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ కు కారణం ఆమేనా.. అసలు విషయం ఏంటంటే..
Follow us on

Raj Kundra Arrested : బాలీవుడ్ లో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ పెద్ద దుమారాన్నే రేపుతోంది. నీలిచిత్రాలను నిర్మించి పలు యాప్ లలో అప్ లోడ్ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశారు. పక్కా ఆధారాలతోనే అతనిని అదుపులోకి తీసుకున్నట్లు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ఫిబ్రవరిలోనే ఈ వ్యవహారంలో రాజ్ కుంద్రాపై కేసు నమోదైంది. తాజాగా ఈ నీలి చిత్రాల రాకెట్‌లో రాజ్ కుంద్రా పాత్ర ప్రముఖంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ కుంద్రా జూన్‌లో ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. మోడల్ షెర్లిన్ చోప్రా ఇచ్చిన కంప్లంట్  ఆధారంగా.. వెబ్ సిరీస్ పేరుతో అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలపై కుంద్రాకు సంబంధించిన ఓ స్టార్టప్ కంపెనీ ఉద్యోగిని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ఉద్యోగికి ఏప్రిల్‌లో బెయిల్ మంజూరైంది. ఈ కేసులో.. రాజ్ కుంద్రాకు కూడా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ సమన్లపై స్పందించిన శిల్పాశెట్టి భర్త ఆ స్టార్టప్ నుంచి తాను అప్పటికే వైదొగిలిగానని.. ఆ కంపెనీకి తనకూ ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. అయితే గతంలో మహిళలను కించపరిచేలా పలు వివాదాస్పద ట్వీట్స్ చేసి వార్తల్లో నిలిచాడు రాజ్. అంతటితో ఆగకుండా సీతాదేవి ఉద్దేశించి కూడా ట్వీట్ చేశాడు రాజ్ కుంద్రా.

 

నిజానికి రాజ్ కుంద్రా పైన ఫిబ్రవరిలో కేసు నమోదు అయ్యింది. ఇపుడు ఏవిడెన్స్ దొరకడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.. అతని అరెస్ట్ కు మూల కారణం నటి షెర్లిన్ చోప్రా. ఆమె ఇచ్చిన కంప్లయింట్ తోనే రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యాడు. తనను పోర్న్ మూవీస్ చేయాలని రాజ్ కుంద్రా బలవంత పెట్టేవాడని ఆమె గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇవే కాదు గతంలోనూ రాజ్ కుంద్రా పై పలు ఆరోపణలు వచ్చాయి. ఐపీఎల్ ఫిక్సింగ్ లోను రాజ్ కుంద్రా హస్తం ఉందని వార్తలు వచ్చాయి. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాజ్ కుంద్రా సహ యజమానిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అలాగే 2018లో బిట్ కాయిన్  కుంబకోణాలోనూ రాజ్ కుంద్రా పై ఆరోపణలు వచ్చాయి. దాంతో అప్పట్లో ఈడీ ఆయనను విచారించింది. తాజాగా పోర్న్ చిత్రాల కేసులో ఇరుక్కోవడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raj Kundra: రాజ్ కుంద్రా గురించి షాకింగ్ విషయాలు చెప్పిన మోడల్.. వీడియో కాల్ లో అలా..

Boyapati Srinu : యాక్షన్ హీరోతో బోయపాటి భారీ ప్లాన్.. బాలయ్య సినిమా తర్వాత ఆ హీరోతోనేనా..?

Hero Srikanth: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో శ్రీకాంత్.. బాలయ్య సినిమా పై ఇంట్రస్టింగ్ కామెంట్స్..