Actress : ఆ స్టార్ హీరోతో లిప్ లాక్ సీన్ తర్వాత వాంతులు.. వంద సార్లు ముఖం కడుక్కున్నా.. హీరోయిన్..
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తక్కువ సమయంలోనే అందంతోపాటు ప్రతిభతోనూ ఆకట్టుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ సినిమా అంటే గ్లామర్ మాత్రమే కాదు.. పాత్ర ప్రాధాన్యం కూడా ముఖ్యమే అని నిరూపించిన తారలు కొందరు ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ లిప్ లాక్, బోల్డ్ సీన్లకు దూరంగా ఉండేది.

సాధారణంగా సినీరంగంలో హీరోయిన్ అంటే అన్ని పాత్రలు, సన్నివేశాలకు రెడీగా ఉండాల్సిందే. కానీ కొందరు హీరోయిన్స్ మాత్రం గ్లామర్ షోకు దూరంగా ఉంటారు. అలాగే తమకంటూ కొన్ని కండీషన్స్ సైతం పెట్టుకుంటారు. పాత్ర, కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ సైతం తనకంటూ కొన్ని హద్దులు పెట్టుకుంది. అయినప్పటికీ చాలా కాలంపాటు సినిమా ప్రపంచంలో చక్రం తిప్పింది. ఆమె ఎవరో తెలుసా.. ? బాలీవుడ్ ఇండస్ట్రీలో మస్త్ మాస్ట్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న రవీనా టాండన్. నటనకు మాత్రమే కాదు ధైర్యానికి సైతం ప్రసిద్ది చెందింది. పత్తర్ కే ఫూల్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. రవీనా టాండన్ 1974 అక్టోబర్ 26 న జన్మించారు. ఆమె సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన వెంటనే అనేక సూపర్ హిట్ చిత్రాలను ఇచ్చింది. 21 సంవత్సరాల వయస్సులో ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.
హిందీలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన రవీనా.. కెరీర్ మొత్తంలో ఎప్పుడూ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించలేదు. ముఖ్యంగా ముద్దు సీన్లకు దూరంగా ఉండేది. కానీ ఒక సినిమాలో అనుకోకుండా హీరోతో లిప్ లాక్ సీన్ చేయాల్సి వచ్చిందని.. ఆతర్వాత వందసార్లు ముఖం కడుకున్నానని తెలిపింది. నిజానికి రవీనా ఏదైనా సినిమాపై సంతకం చేసినప్పుడల్లా, ముద్దు సన్నివేశంలో నటించమని ఎప్పుడూ అడగకూడదని ఆమె షరతు పెట్టింది. కానీ ఒకసారి ‘అభయ్’ సినిమా షూటింగ్ సమయంలో ఒక సంఘటన జరిగింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో అనుకోకుండా హీరోతో లిప్ లాక్ సీన్ జరిగిందని.. ఆ తర్వాత తన గదిలో వాంతులు చేసుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ సన్నివేశం తర్వాత ఎంతో బాధపడ్డానని.. వెంటనే బ్రష్ చేసుకుని వందసార్లు ముఖం కడుక్కున్నానని తెలిపింది.
ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..
రవీనా టాండన్ హిందీలో షారుఖ్ ఖాన్ జోడిగా యే లమ్హే జుదాయి కే, జాదూ, జమానా దీవానా, పెహ్లా నషా వంటి చిత్రాలలో కలిసి పనిచేశారు. ఆ తర్వాత కూడా, రవీనా షారుఖ్ తో మరో చిత్రాన్ని తిరస్కరించింది. కారణం పొట్టి దుస్తులు ధరించడమే. డ్రెస్సింగ్ స్టైల్, రొమాంటిక్ సీన్స్ కారణంగా ఎన్నో సినిమాలు కోల్పోవాల్సి వచ్చిందని గుర్తుచేసుకుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..
