Rashmika Mandanna: శ్రీవల్లికి బాలీవుడ్‏లో మరో ఆఫర్.. బడా ప్రొడ్యూసర్‏తో మంతనాలు అందుకేనా ?..

యంగ్ హీరో నాగశౌర్య నటించిన ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది రష్మిక మందన్నా. ఆ తర్వాత

Rashmika Mandanna: శ్రీవల్లికి బాలీవుడ్‏లో మరో ఆఫర్.. బడా ప్రొడ్యూసర్‏తో మంతనాలు అందుకేనా ?..
Rashmika

Updated on: Jan 25, 2022 | 5:00 PM

యంగ్ హీరో నాగశౌర్య నటించిన ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది రష్మిక మందన్నా. ఆ తర్వాత గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ కన్నడ బ్యూటీ. ఈ మూవీతో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు అందుకుంటూ టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. ఇటీవల అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయింది. ప్రస్తుతం పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ ఎంజాయ్ చేస్తుంది రష్మిక.

ఇటీవల రష్మిక ముంబైలో కనిపించింది. అంతేకాదు.. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‏తో కలిసినట్లుగా సమాచారం. దీంతో కరణ్ జోహర్ నిర్మిస్తోన్న తదుపరి చిత్రం ధర్మలో రష్మిక నటించనున్నట్లుగా టాక్. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం బీటౌన్‍లోనూ బిజీ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇక ఇటీవల ముంబై ఎయిర్ పోర్టులో కనిపించే సమయంలో డెనిమ్ షార్ట్ వేసుకోవడంతో ట్రోలింగ్‏కు గురయ్యింది. ఆమె వేసుకున్న డెనిమ్ షార్ట్ మరీ పొట్టిగా ఉండడంతో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. టీ-షర్ట్, షార్ట్ ధరించి ఎయిర్ పోర్టులో ప్రత్యక్షం అయ్యింది రష్మిక. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆమె వేసుకున్న టీ-షర్ట్, షార్ట్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇది మరీ ఓవర్ అంటూ.. ఈమెకు చలిగా లేదా అని.. కొందరు కామెంట్ చేస్తున్నారు.

Also Read: BA Raju Son Wedding: పెళ్లిపీటలెక్కిన దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు.. సరిగ్గా అదే ముహూర్తానికి..

Namrata Shirodkar : అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అంటున్న మహేష్ సతీమణి.. వైరల్ అవుతున్న పోస్ట్

Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..

Rashmi Gautam: హాట్ టాపిక్ గా యాంకర్ రష్మీ పెళ్లి టాపిక్.. సీక్రెట్ గా చేసేసుకుందంటూ గుసగుసలు