Malaika Arora: రూమర్స్ పై స్పందించిన మలైకా.. జీవితం అయిపోదంటూ..

|

Jan 15, 2022 | 7:18 AM

బాలీవుడ్ లవ్‏బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా రోజులుగా వీరిద్దరూ

Malaika Arora: రూమర్స్ పై స్పందించిన మలైకా.. జీవితం అయిపోదంటూ..
Arjun
Follow us on

బాలీవుడ్ లవ్‏బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ బీటౌన్ లో టాక్ వినిపిస్తోంది. అయితే గత కోద్ది రోజులుగా ఈ జంట విడిపోతున్నారంటూ నెట్టింట్లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే వీరి బంధానికి ముగింపు పలకబోతున్నారంటూ టాక్ వినిపించింది. అయితే తమ పై వస్తున్న రూమర్స్ పై ఇటీవల అర్జున్ కపూర్ స్పందించారు. మలైకతో కలిసి ఉన్న ఫోటోస్ షేర్ చేస్తూ తాము విడిపోతున్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. తాజాగా మలైకా రూమర్స్ పై స్పందించారు.

జీవితం అప్పుడే అయిపోలేదంటూ మలైక తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. “40 ఏళ్ల వయసులో ప్రేమలో పడండ సాధారణ విషయంగా భావించండి. మీ 30 ఏళ్ల వయసులో కొత్త కలలను కనుగొని సాధించడాన్ని అంగీకరించండి. మీ 50 ఏళ్ల వయసులో మిమ్మల్ని, మీ లక్ష్యాన్ని గుర్తుంచడాన్నీ అంగీకరించండి. జీవితం 20 ఏళ్లను దాటేసింది. 25 ఏళ్లకే ముగియదు. అలా నటించడం మానేద్దాం ” అంటూ చెప్పుకోచ్చారు. ఈ పోస్టుతో ఇద్దరి మధ్య వయసు అంతరంపై ప్రశ్నిస్తున్న వారందరికీ గట్టి సమాధానం చెప్పారు మలైకా. కాగా అర్జున్ కపూర్ వయసు 36 ఏళ్లు కాగా.. మలైక వయసు 48 ఏళ్లు.. వీరిద్దరి మధ్య 12 ఏళ్ల వ్యత్యాసం ఉంది.

నీచమైన పుకార్లకు చోటు లేదు. సురక్షితంగా, సంతోషంగా ఉండండి. లవ్ యూ ఆల్.’’ అంటూ క్యాప్షన్ పెట్టిన అర్జున్ కపూర్.. తమ జంటపై రూమర్ క్రియేట్ చేసే వారి చెంప చెళ్లుమనిపించాడు.

Also Read: Samantha: స‌మంత‌కు మ‌రో క్రేజీ ఆఫ‌ర్‌.. సామ్ కోసం రంగంలోకి దిగుతోన్న మాట‌ల మాంత్రికుడు.?

Vijay Devarakonda: త‌న మ‌ద్ద‌తు చిరుకే అంటోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ట్రెండింగ్‌లో చిరు ట్వీట్‌..

Hari Hara Veera Mallu: ప‌వ‌న్, క్రిష్ సినిమా క‌థపై హింట్ ఇచ్చిన నిధి.. ఆస‌క్తి రేపుతోన్న స్టోరీ లైన్‌..