Kiara Advani: అప్పుడు చావును దగ్గర నుంచి చూశాను.. చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్న కియారా..

|

Jun 07, 2022 | 12:21 PM

కియారా తన కాలేజీ రోజులలో తన స్నేహితులతో కలిసి మెక్‍లియోడ్ గంజ్ ధర్మశాలలో ఉన్నప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.

Kiara Advani: అప్పుడు చావును దగ్గర నుంచి చూశాను.. చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్న కియారా..
Kiara Advani
Follow us on

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా హిందీలో భుల్ భూలయ్యా సినిమాకు సిక్వెల్ గా వచ్చిన భూల్ భూలయ్యా 2 చిత్రంలో నటించింది. కార్తిక్ ఆర్యన్, కియారా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టబు, రాజ్ పాల్ యాదవ్ కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, సినీ 1 స్టూడియోస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, అంజుమ్ ఖేతాని కలిసి నిర్మించారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గోన్న కియారా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

కియారా తన కాలేజీ రోజులలో తన స్నేహితులతో కలిసి మెక్‍లియోడ్ గంజ్ ధర్మశాలలో ఉన్నప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో విపరీతమైన మంచు కురవడం.. ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలు ఉండడంతో నీరు, విద్యుత్ లేకుండా దాదాపు నాలుగు రోజులు ఓ హోటల్లో చిక్కుకున్నారని తెలిపింది. ఈ హోటల్ గదిలో నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి తమ పక్కనే ఉన్న కుర్చీకి ఆకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయని..తన స్నేహితురాలు మేల్కోని పెద్దగా అరిచి అందరిని నిద్రలేపిందని..దీంతో అందరూ ఆ మంటలకు దూరంగా పరిగెత్తామని తెలిపింది. అలా మంటలు అంటుకున్న సమయంలో చావును దగ్గరి నుంచి చూసినట్లు అనిపించిందని.. ఆ ప్రమాదంలో తనతో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదని.. తనకు ఎప్పటికీ ఆ సంఘటన చాలా బాధాకరమైన అనుభవం అంటూ చెప్పుకొచ్చింది కియారా. అలాగే.. తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఎలా ఉండాలనే విషయం గురించి స్పష్టతనిచ్చింది ఈ చిన్నది.. అర్థం చేసుకోవడం.. గౌరవం, విధేయత, కామెడీ.. నమ్మకం.. ఇలా అన్నింటిలోనూ తనను తాను ప్రేమించినట్లుగా.. చూసినట్లుగా.. విన్నట్లుగా అనిపించేలా ఉండే వ్యక్తిని కోరుకుంటున్నట్లు తెలిపింది.