Kareena Kapoor: చిక్కుల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఆ ఒక్క పని చేసినందుకు కోర్టులు నోటీసులు..

|

May 11, 2024 | 4:38 PM

తాజాగా బీటౌన్ హీరోయిన్.. సైఫ్ అలీ ఖాన్ సతీమణి కరీనా కపూర్‏ చిక్కుల్లో పడింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ బ్యూటీకి నోటీసులు జారీ చేసింది. అది కూడా ఇటీవల ఓ విషయంలో చిన్న పదం ఉపయోగించినందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరలవుతుంది. ఇంతకీ కరీనా కపూర్ చేసిన మిస్టేక్ ఏంటీ ? అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్స్.

Kareena Kapoor: చిక్కుల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఆ ఒక్క పని చేసినందుకు కోర్టులు నోటీసులు..
Kareena Kapoor
Follow us on

సాధారణంగా స్టార్ హీరోహీరోయిన్స్ చేసే చిన్న చిన్న పొరపాట్లు వాళ్లను చిక్కుల్లో పడేస్తాయి. ఫలితంగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఈమధ్య కాలంలో బాలీవుడ్ తారలు అనుకోకుండానే సమస్యల్లో పడిపోతున్నారు. తాజాగా బీటౌన్ హీరోయిన్.. సైఫ్ అలీ ఖాన్ సతీమణి కరీనా కపూర్‏ చిక్కుల్లో పడింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆ బ్యూటీకి నోటీసులు జారీ చేసింది. అది కూడా ఇటీవల ఓ విషయంలో చిన్న పదం ఉపయోగించినందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరలవుతుంది. ఇంతకీ కరీనా కపూర్ చేసిన మిస్టేక్ ఏంటీ ? అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్స్.

సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన కరీనా కపూర్.. తన తోటి నటుడు సైఫ్ అలీ ఖాన్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న కరీనా.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం కరీనా తన ప్రెగ్నెన్సీ అనుభవాలను తెలియజేస్తూ ఓ పుస్తకం రాసింది. అయితే ఆ పుస్తకం పేరులో బైబిల్ అనే పదాన్ని ఉపయోగించింది. కరీనా బైబిల్ అనే పదాన్ని వాడడం వ్యతిరేకిస్తూ ఒక క్రైస్తవ సామాజిక కార్యకర్త కోర్టును ఆశ్రయించారు. జబల్‌పూర్‌కు చెందిన క్రిస్టోఫర్ ఆంథోనీ అనే క్రైస్తవ సామాజిక కార్యకర్త పుస్తకం పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానిపై కోర్టు చర్యలు తీసుకుంది.

జస్టిస్ గురుపాల్ సింగ్ అహ్లువాలియా నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ కరీనాకు నోటీసులు జారీ చేసింది. ఆ పదం ఉపయోగించడానికి గల కారణమేంటని ప్రశ్నించింది. కరీనాతోపాటు పుస్తకాలు విక్రయించే వారికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయాలని క్రిస్టోఫర్ ఆంథోని కోరారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు బైబిల్ అనేది పవిత్ర గ్రంథం. కానీ బైబిల్ పేరును కరీనా కపూర్ గర్భంతో పోల్చడం సరికాదని.. క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు క్రిస్టోఫర్ ఆంథోని. కరీనా రాసిన ఈ పుస్తకం 2021లో ప్రచురించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.