Shilpa Shetty: రూ. కోట్ల విలువైన ఆస్తులను శిల్పాకు ట్రాన్స్‌ఫర్‌ చేసిన రాజ్‌కుంద్రా.. అదే కారణమంటూ..

Shilpa Shetty: బాలీవుడ్‌లో ఆఫర్ల కోసం ప్రయత్నించే ఔత్సాహిక నటీమణులను బలవంతంగా పోర్న్‌ వీడియోల్లో నటింపజేశాడన్న ఆరోపణలతో.. ప్రముఖ వ్యాపార వేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌...

Shilpa Shetty: రూ. కోట్ల విలువైన ఆస్తులను శిల్పాకు ట్రాన్స్‌ఫర్‌ చేసిన రాజ్‌కుంద్రా.. అదే కారణమంటూ..

Updated on: Feb 05, 2022 | 6:40 PM

Shilpa Shetty: బాలీవుడ్‌లో ఆఫర్ల కోసం ప్రయత్నించే ఔత్సాహిక నటీమణులను బలవంతంగా పోర్న్‌ వీడియోల్లో నటింపజేశాడన్న ఆరోపణలతో.. ప్రముఖ వ్యాపార వేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌ అయ్యి బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా వార్తల్లో లేని రాజ్‌కుంద్రా మరోసారి హెడ్‌లైన్స్‌లోకి ఎక్కారు.

రాజ్‌కుంద్రాకు చెందిన విలువైన ఆస్తులను శిల్పాశెట్టి పేరు మీదకు ట్రాన్స్‌ఫర్‌ చేసినట్లు ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముంబయిలో ఖరీదైన ప్రదేశాల్లో ఒకటైన జుహూలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాజ్‌కుంద్రా పేరు మీదున్న ఐదు ఫ్లాట్స్‌ను శిల్పా పేరు మీదకు మార్చినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాట్స్‌ విలువ ఏకంగా రూ. 38.5 కోట్లని అంచనా. వీటి రిజిస్ట్రేషన్‌ కోసమే ఏకంగా రూ. 2 కోట్లు ఖర్చు చేశారని వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పటికప్పుడు రాజ్‌కుంద్రా తన పేరు మీదున్న ఆసక్తిని శిల్పా శెట్టికి ఎందుకు ట్రాన్స్‌ఫర్‌ చేశారన్న దానిపై సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఈ జంట విడాకులు తీసుకోనుందని, అందుకే ఆస్తుల పంపకం జరిగుతుందనే వాదన వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: SAVING ACCOUNTS : రెండు కంటే ఎక్కువ పొదుపు ఖాతాలుంటే లాభమా.. నష్టమా..?

Viral Photos: రష్యాలోని టెంబులాట్ ఎర్కెనోవ్ కోట చాలా ఫేమస్‌.. దీనిని ఒక వ్యాపారవేత్త నిర్మించారు..?

Bizarre Incident: పోస్ట్‌మార్టం చేయబోతుండగా లేచి కూర్చున్న వ్యక్తి! షాక్‌ తిన్న వైద్యులు!!