Viral: ఈ ఫోటోలోని అబ్బాయి ఇప్పుడు స్టార్ యాక్టర్.. ఎవరో కనుక్కోగలరా?
ఈ అబ్బాయిని గుర్తుపట్టారా..? ఓ స్టార్ హీరో తనయుడు. ఇప్పుడు స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఓ అందాల రాశిని వివాహమాడాడు. ఈ రోజు ఇతని బర్త్ డే కావడంతో.. ఆయన సోదరి చిన్ననాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అతనెవరో మీరు కనిపెట్టగలరా..?

స్టార్ ఆర్టిస్టుల చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫోటోలను సెలబ్రిటీలు స్వయంగా షేర్ చేస్తుంటారు. మరికొన్ని ఫోటోలు వారి అభిమానులు వైరల్ చేస్తుంటారు. ఇప్పుడు ఓ స్టార్ హీరో చిన్ననాటి ఫోటో వైరల్‌గా మారింది. ఈ ఫోటోను సదరు హీరో సోదరి షేర్ చేసింది. మీరెవరైనా గుర్తుపట్టారా..? పైన ఫోటోలో ఉన్నది అభిషేక్ బచ్చన్. ఈరోజు (ఫిబ్రవరి 5) అభిషేక్ పుట్టినరోజు. ఆ సందర్భంగా శ్వేతా బచ్చన్ తన సోదరుడి చిన్ననాటి ఫోటోను షేర్ చేసి.. శుభాకాంక్షలు తెలిపారు.
View this post on Instagram
ఈరోజు అభిషేక్ బచ్చన్ 48వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు నలువైపుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా అభిషేక్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయన సాధించిన విజయాలు గుర్తుకొంటున్నారు. తదుపరి ప్రాజెక్ట్స్ విజయవంతం అవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. శ్వేతా బచ్చన్.. అభిషేక్ చిన్ననాటి అందమైన ఫోటోను షేర్ చేయడంతో.. ఫ్యాన్స్ దానని వైరల్ చేస్తున్నారు. ఇది 4 దశాబ్దాల క్రితం . శ్వేత, అభిషేక్ కలిసి దిగిన ఫోటో. ఫోటోలో ఇద్దరూ ఏదో తింటూ కనిపించారు.
శ్వేతా బచ్చన్ కుమార్తె నవ్య నవేలి నందా కూడా అభిషేక్‌కి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకురాలు జోయా అక్తర్, నటి సోనాలి బింద్రే తదితరులు విషెస్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు (ఫిబ్రవరి 5, 5:30 PM) అభిషేక్ గురించి ఐశ్వర్య రాయ్ ఎలాంటి పోస్ట్ చేయలేదు. అభిషేక్, ఐశ్వర్య విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అయితే ప్రొ కబడ్డీ సందర్భంగా వీరిద్దరూ కలిసి కనిపించారు. దీంతో వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. భార్య ఐశ్వర్య అభిషేక్‌ను విష్ చేసిందా లేదా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




