Sushmita Sen: కొండచిలువను పెంచుకుంటున్న హీరోయిన్‌ సుస్మితా సేన్‌.. వీడియో వైరల్.

Sushmita Sen: కొండచిలువను పెంచుకుంటున్న హీరోయిన్‌ సుస్మితా సేన్‌.. వీడియో వైరల్.

Anil kumar poka

|

Updated on: Feb 05, 2024 | 5:30 PM

ధారణంగా సెలబ్రెటీల చేతుల్లో ఎక్కువగా పెంపుడు కుక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే పెట్స్‌ ఇష్టపడేవారు ఎవరైనా ఫస్ట్‌ ప్రయారిటీ ఇచ్చేది డాగ్స్‌కే. కొందరు పిల్లులను కూడా పెంచుకుంటారు. కానీ పాములను పెంచుకోవడం ఎక్కడైనా చూశారా? పాము పేరు చెబితేనే కొందరు వణికిపోతారు. అది కనబడితే ఆమడదూరం పారిపోతారు. అలాంటిది పాములను పెంచుకోవడమా అనుకుంటున్నారు కదూ.. కానీ అలాంటివాళ్లు కూడా ఉన్నారు. అది ఎవరో కాదు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సుస్మితా సేన్‌.

ధారణంగా సెలబ్రెటీల చేతుల్లో ఎక్కువగా పెంపుడు కుక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే పెట్స్‌ ఇష్టపడేవారు ఎవరైనా ఫస్ట్‌ ప్రయారిటీ ఇచ్చేది డాగ్స్‌కే. కొందరు పిల్లులను కూడా పెంచుకుంటారు. కానీ పాములను పెంచుకోవడం ఎక్కడైనా చూశారా? పాము పేరు చెబితేనే కొందరు వణికిపోతారు. అది కనబడితే ఆమడదూరం పారిపోతారు. అలాంటిది పాములను పెంచుకోవడమా అనుకుంటున్నారు కదూ.. కానీ అలాంటివాళ్లు కూడా ఉన్నారు. అది ఎవరో కాదు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సుస్మితా సేన్‌. అవును సుస్మిత ఓ పామును పెంచుకుంటున్నారట. సుస్మితాకి పాములంటే చాలా ఇష్టమట. అందుకే ఇప్పుడు పామును పెంచుకునే పనిలో పడినట్టు తెలుస్తోంది. సరే అది ఇది ఎందుకని… ఏకంగా కొండచిలువనే పెంచుకుంటున్నారట. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆ కొండ చిలువతో సరదాగా ఆడుకుంటున్నారట. అయితే తన కొండ చిలువకు సంబంధించిన విషయాలను సుష్మితా ఎక్కడా చెప్పలేదు కానీ..ఆమె సన్నిహితుల ద్వారా మీడియాకు ఈ విషయం లీకైంది. దీన్ని సుస్మిత ఖండించకపోవడంతో బాలీవుడ్‌ జనాలు ఇది నిజమనే నమ్ముతున్నారు.

సుస్మిత 1997లో రత్సగన్ అనే తమిళ్ సినిమాతో తెరంగేట్రం చేశారు. మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలోని అగ్రకథానాయకులందరితో నటించారు. ముఖ్యంగా ఒకే ఒక్కడు సినిమాలోని షకలకా బేబీ పాటతో సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ రాణించారు. ప్రస్తుతం పలు చిత్రాలతో పాటు వెబ్‌ సిరీస్‌ చేస్తూ కెరీర్‌ పరంగా ఇప్పటికీ బీజీగా ఉన్నారు. ఆ మధ్య ఆర్య-3 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చి, తనదైన నటనతో ఆకట్టుకున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..