AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: హాలీవుడ్‌ సినిమాలను బీట్‌ చేసేలా ఆర్‌ఆర్‌ఆర్‌.. జక్కన్న సినిమాపై బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇటీవల టాలీవుడ్‌ సినిమాలు కూడా బాలీవుడ్‌లో వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. హిందీ సినిమాలకు మించి కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్‌ పండితులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అల్లు అర్జున్‌ నటించిన పుష్ప బాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

RRR Movie: హాలీవుడ్‌ సినిమాలను బీట్‌ చేసేలా ఆర్‌ఆర్‌ఆర్‌.. జక్కన్న సినిమాపై బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు..
Rrr Movie
Basha Shek
|

Updated on: Mar 29, 2022 | 10:21 AM

Share

ఇటీవల టాలీవుడ్‌ సినిమాలు కూడా బాలీవుడ్‌లో వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. హిందీ సినిమాలకు మించి కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్‌ పండితులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అల్లు అర్జున్‌ నటించిన పుష్ప బాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajumouli) తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) సినిమా కూడా అదే దారిలో నడుస్తోంది. గత శుక్రవారం (మార్చి 25) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం హిందీ లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సినిమాలో చెర్రీ, తారక్‌ల నటనపై పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveeer singh) ఈ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా హాలీవుడ్ సినిమాలను కూడా బీట్ చేసేసి దూసుకెళ్తుంది. ఇది నిజంగా ఎంతో గర్వంగా అనిపిస్తుంది. రాజమౌళి ఇలాంటి అద్భుతమైన సినిమాలతో మన భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తున్నారు. ఇది మనమందరం సంతోషించదగ్గ విషయం’ అని చెప్పుకొచ్చాడు రణ్‌వీర్‌.

టాలీవుడ్ ను చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి..

ఈ సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు సాంగ్ ను తెలుగులో పాడి ఆకట్టుకున్నాడు రణ్‌వీర్‌. ఇక సినిమా విడుదలైన రోజే రూ. 223 కోట్లు కొల్లగొట్టిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా.. మూడు రోజుల్లో రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్‌ పండితులు తెలిపారు. కాగా అగ్రదర్శక నిర్మాత కరణ్‌ జోహార్ కూడా ఆర్‌ఆర్ఆర్‌ సినిమాను ఆకాశానికెత్తేశాడు. టాలీవుడ్ చిత్రాలను చూసి బాలీవుడ్ ఫిల్మ్‌ మేకర్స చాలా నేర్చుకోవాలి. రొటీన్‌ సినిమాలు కాకుండా విభిన్న పంథాలో సినిమాలను ఎంచుకోవాలి. బాలీవుడ్‌లో ఒక మూస ధోరణి కొనసాగుతోంది. బయోపిక్స్‌ హిట్ అయితే అందరూ ఆతరహా కథలపైనే పడతారు. సందేశాత్మక సినిమాలు విజయం సాధిస్తే అవే కథల్ని ఎంచుకుంటారు. అయితే టాలీవుడ్‌లో మాత్రం సొంత ఆలోచనలతోనే సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అందుకే పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమాలు హిందీలో కూడా కలెక్షన్ల వర్షం కురిపించాయి ‘ అని జోహార్‌ చెప్పుకొచ్చారు.

Also Read:Viral Video: బంధీ నుంచి విముక్తి.. కానీ ఎగరడమే మర్చిపోయింది.. కన్నీళ్లు పెట్టిస్తోన్న వీడియో..

Investment: రిటైర్మెంట్ తరువాత ఏ ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి లాభదాయకం?.. పూర్తి వివరాలు..

Onions Side Effects: ఉల్లిపాయలు ఎక్కువగా తింటున్నారా.. జాగ్రత్త..!