వరుస ప్లాప్‌లతో ఇబ్బందిపడిన బాలీవుడ్ బడా హీరోలు దక్షిణాది సినిమాలను రిమేక్ చేసి విజయం సాధించిన సందర్భాలు కోకొల్లలు. ఒకప్పుడు సౌత్ సినిమాలు అంటే అంతగా ఇష్టపడని బాలీవుడ్ బడా బాబులు ఇప్పుడు దీనిపైనే మెయిన్ ఫోకస్ చేసి విజయాలు రాబట్టుకుంటున్నారు. దక్షిణాదిన పెద్ద సినిమా రిలీజ్ అయిందంటే చాలు దాని రిమేక్ హక్కుల కోసం ఎగబడుతున్నారు.
వరుస ప్లాప్‌లతో విసిగిపోయిన బాలీవుడ్ కండల హీరో సల్మాన్‌ఖాన్ సౌత్ సినిమాల రిమేక్‌లలో నటించి విజయాలను సాధించాడు. రెడీ, పోకిరీ, కిక్ వంటి సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఇటీవల విజయ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా రిమేక్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటించి సెక్సెస్ సాధించాడు. ఇక ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి సినిమాను హిందీలో రిమేక్ చేస్తున్నారు. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెళ్లి సినిమా కూడా హిందీలో రిమేక్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ నిర్మాత తౌరానీ ఈ చిత్రాన్ని రిమేక్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే దాదాపుగా సౌత్ సినిమాలన్ని బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలుస్తున్నాయి.