Vijay Devarakonda & Sara Ali Khan : యంగ్ హీరో విజయ్ దేవరకొండకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు. అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. ఇటీవల ఈ మూవీని హిందీలో రీమేక్ చేయగా.. అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో విజయ్ కు బాలీవుడ్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. తాజాగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్ అంట. విజయ్‌తో సెల్ఫీ తీసుకున్న ఫోటోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేయడంతో.. అవి నెట్టింట్లో వైరల్ అవతున్నాయి.
ప్రస్తుతం విజయ్.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను చార్మీ, కరణ్ జోహార్లు సంయుక్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఇందులో విజయ్‌కు జోడిగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కోసం ముంబై వెళ్ళిన విజయ్.. అక్కడ కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీలో పాల్గోన్నాడు. అక్కడికి బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ కూడా వచ్చింది. ఆ సమయంలోనే విజయ్‌తో ఆమె తీసుకున్న సెల్ఫీని తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది సారా. ఆ పార్టీలో బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు కూడా పాల్గొన్నారు.
Also Read:
దివంగత హీరో చిరంజీవి సర్జా కొడుకు వీడియోను షేర్ చేసిన మేఘనా.. ‘జూనియర్ సీ’ అంటూ ఎమోషనల్ మేసేజ్..