Varun Tej: హీరోయిన్ ఫిక్స్.. బాలీవుడ్‌ హాటీతో వరుణ్‌ రొమాన్స్‌‌..!

కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 10వ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ నెలాఖరు నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో

Varun Tej: హీరోయిన్ ఫిక్స్.. బాలీవుడ్‌ హాటీతో వరుణ్‌ రొమాన్స్‌‌..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Team Veegam

Updated on: Feb 25, 2020 | 5:04 PM

Varun Tej: కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 10వ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ఈ నెలాఖరు నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. దానికి సంబంధించి ఒలింపిక్ పతక విజేత టోనీ జెఫ్రీస్ దగ్గర గతేడాది బాక్సింగ్ మెలకువలు కూడా నేర్చుకొని వచ్చారు వరుణ్.

కాగా ఈ మూవీలో హీరోయిన్‌ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ 3 ద్వారా హీరోయిన్‌గా కెరీర్‌గా ప్రారంభించిన సై మంజ్రీకర్ ఈ మూవీలో వరుణ్‌తో రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఆమె డేట్లు కూడా ఇచ్చేసినట్లు టాక్. అంతేకాదు దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా అల్లు అరవింద్ సమర్పణలో సందీప్ ముద్ద, అల్లు బాబీ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇప్పటికే రెండు వరుస హిట్లతో జోరు మీదున్న వరుణ్.. ఈ మూవీతో హ్యాట్రిక్‌ను ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు.

Read This Story Also: ఆ దర్శకుడికి వరుణ్ రెండో ఛాన్స్..?