
Swara Bhaskar: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నెటిజన్లు అభిమానులతో నేరుగా మాట్లాడే రోజులు వచ్చేశాయ్. ఎలాంటి మొహమాటం లేకుండా ఏది పడితే అది అడుగుతున్నారు. సెలబ్రిటీలు సైతం తమ ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తున్నారు. అయితే తారలు ఇచ్చిన ఈ చనువును కొందరు నెటిజన్లు దుర్వినియోగం చేస్తున్నారు. చనువు ఇచ్చారు కదా అని రెచ్చిపోయి, ఏది పడితే అది అడుగుతున్నారు. కనీసం ఎదుటి వ్యక్తి నొచ్చుకుంటారా.? అని కూడా ఆలోచించకుండా కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ బ్యూటీ స్వరా భాస్కర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
స్వరా భాస్కర్ నటించిన తాజా చిత్రం ‘జహా చార్ యార్’ సెప్టెంబర్ 16న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ.. ‘సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే అందులో ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. ‘ప్రస్తుతం మా అపార్ట్‌మెంట్‌లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాబట్టి నిద్రించడానికి ప్రశాంతమైన స్థలం దొరకట్లేదు. మీ సినిమా విడుదలైతే వెళ్లేందుకు వెయిట్ చేస్తున్నా’ అంటూ కామెంట్ చేశాడు.
Haha! Glad to have given you a chance to land your much practiced and rehearsed joke. ???
Now go show off to your boyz that I replied! ??✨ https://t.co/HOCqetKdZq— Swara Bhasker (@ReallySwara) August 4, 2022
దీంతో ఈ ట్వీట్‌కు బదులిచ్చిన స్వరా భాస్కర్ స్పందిస్తూ.. ‘మీరు చాలా ప్రాక్టీస్ చేసి, రిహార్సల్ చేసిన జోక్‌ను ల్యాండ్ చేయడానికి ట్విట్టర్ అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. నేను కూడా ప్రత్యుత్తరం ఇచ్చానని మీలాంటి అబ్బాయిలకు చూపించండి’ అంటూ రిప్లై ఇచ్చిందీ అందాల తార దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టిం వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..