AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: సిరి, షణ్ముఖ్‌ల రిలేషన్‌పై స్పందించిన.. సిరి బాయ్‌ ఫ్రెండ్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్‌..

Bigg Boss 5 Telugu: ప్రస్తుతం బిగ్‌బిస్‌ రియాలిటీ షోకు సంబంధించి సిరి, షణ్ముఖ్‌ల వార్త తెగ వైరల్‌గా మారింది. నిజానికి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వచ్చేకంటే ముందే వీరిద్దరికి పరిచయం ఉంది. కొన్ని షార్ట్‌ ఫిలిమ్స్‌లో కలిసి...

Bigg Boss 5 Telugu: సిరి, షణ్ముఖ్‌ల రిలేషన్‌పై స్పందించిన.. సిరి బాయ్‌ ఫ్రెండ్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్‌..
Siri Boyfriend
Narender Vaitla
| Edited By: |

Updated on: Nov 27, 2021 | 5:54 PM

Share

Bigg Boss 5 Telugu: ప్రస్తుతం బిగ్‌బిస్‌ రియాలిటీ షోకు సంబంధించి సిరి, షణ్ముఖ్‌ల వార్త తెగ వైరల్‌గా మారింది. నిజానికి బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి వచ్చేకంటే ముందే వీరిద్దరికి పరిచయం ఉంది. కొన్ని షార్ట్‌ ఫిలిమ్స్‌లో కలిసి నటించారు కూడా. దీంతో సహజంగానే వీరిద్దరు కొంచెం చనువుగా ఉన్నారు. అయితే ఇది కాలక్రమేణా శృతి మించుతూ వచ్చింది. మాటి మాటికి హగ్‌లు, ముద్దులు ఇచ్చుకోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక షణ్ముఖ్‌ ఇప్పటికే దీప్తితో ప్రేమలో ఉండడం, అటు సిరికి కూడా ఇప్పటికే మరో వ్యక్తితో నిశ్చితార్థం కావడంతో సిరి, షణ్ముఖ్‌ల బంధం నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్లు చేస్తు వస్తున్నారు.

దీంతో తాజాగా సిరి తల్లి కూడా ఆమెకు వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల బిగ్‌బాస్‌ హౌజ్‌కి వెళ్లిన సిరి తల్లి.. ఎవరి గేమ్‌ వాళ్లు ఆడితే మంచిదంటూ ఇద్దరికీ హితబోద చేసిన విషయం తెలిసిందే. దీంతో సిరి తల్లి అలా అనడంపై సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే సిరి, షణ్ముఖ్‌ల బంధం గురించి సిరికి కాబోయే భర్త శ్రీహాన్‌ కూడా ఎట్టకేలకు స్పందించాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేశాడు.

Siri Biggboss

ఈ విషయమై శ్రీహాన్‌ స్పందిస్తూ.. ‘సిరి మథర్‌కి ఆ విషయాన్ని ఎలా చెప్పాలో తెలియక అలా అనేసింది. పాపం వాళ్లు ఉం‍టున్న వాతావరణం అలాంటిది. ఒక తల్లిగా కూతుర్ని బయట తప్పుగా అంటుంటే తీసుకోలేక అలా అనేశారు. ఆంటీ ఇలా అంటారని నేను కూడా ఊహించలేదు. దయచేసి ఆమెపై కోప్పడకండి. ఆమె తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. ఆ ఇద్దరి (సిరి, షణ్ముఖ్‌) బంధాన్ని నేను గౌరవిస్తాను’ అని రాసుకొచ్చాడు.

Also Read: Bigg Boss 5 Telugu: బీఎమ్‌డబ్ల్యూ కొన్న బిగ్‌బాస్‌ కంటెస్టంట్‌.. కల నెరవేరిందంటూ..

Viral Video: ఇలాకూడా గిన్నిస్‌ రికార్డ్‌ సాధించొచ్చా !! వీడియో

Viral Video: స్టంట్ అదిరింది !! వీపు విమానం మోత మోగింది !! వీడియో