బిగ్‌బాస్ 3: రవి ఓ వెధవ.. వాడితో సొల్లు డిస్కషన్ ఎందుకు..? రెచ్చిపోయిన పునర్నవి
బుల్లితెరపై బిగ్‌బాస్ మూడో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. బిగ్‌బాస్ టాస్క్‌లు, కంటెస్టెంట్‌ల మధ్య గొడవలు, ప్రేమలు.. ఇలా ప్రతి అంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక మంగళవారం కూడా హాట్‌హాట్‌గా షో ప్రారంభం కాగా.. సోమవారం నాటి నామినేషన్ ప్రక్రియపై బాబా భాస్కర్, వరుణ్ సందేశ్‌తో డిస్కషన్ మొదలుపెట్టాడు. పునర్నవి తను హౌస్‌లో ఉండాలంటే ఉండొచ్చు కాని.. తనను భాష రాదని విమర్శించడం నచ్చలేదని బాబా భాస్కర్. ఆమె తనపై ఆరోపణలు చేస్తుంటే క్లారిటీ ఇవ్వాలని అనిపించలేదని.. అందుకే […]

బుల్లితెరపై బిగ్‌బాస్ మూడో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. బిగ్‌బాస్ టాస్క్‌లు, కంటెస్టెంట్‌ల మధ్య గొడవలు, ప్రేమలు.. ఇలా ప్రతి అంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక మంగళవారం కూడా హాట్‌హాట్‌గా షో ప్రారంభం కాగా.. సోమవారం నాటి నామినేషన్ ప్రక్రియపై బాబా భాస్కర్, వరుణ్ సందేశ్‌తో డిస్కషన్ మొదలుపెట్టాడు. పునర్నవి తను హౌస్‌లో ఉండాలంటే ఉండొచ్చు కాని.. తనను భాష రాదని విమర్శించడం నచ్చలేదని బాబా భాస్కర్. ఆమె తనపై ఆరోపణలు చేస్తుంటే క్లారిటీ ఇవ్వాలని అనిపించలేదని.. అందుకే వదిలేశానని బాబా.. వరుణ్‌కు చెప్పాడు.
మరోవైపు పునర్నవి సైతం రాహుల్‌లో ఇదే నామినేషన్స్‌పై చర్చ మొదలుపెట్టింది. వరుణ్ కూడా తోడు కావడంతో సీన్‌లోకి ఎంటర్ అయిన వితికా.. నామినేషన్స్ సందర్భంగా రవి తనపై ఆరోపణలు చేయడం పట్ల మండిపడింది. దానికి ‘నువ్ రవితో మాట్లాడావా? అని వరుణ్ అడగడంతో నేను ఎందుకు మాట్లాడతా’ అని వితికా అంటుండగానే.. పునర్నవి కల్పించుకుంది. ‘రవిగాడు వెధవ.. ఆ వెధవతో ఎందుకు మాట్లాడాలి.. వాడితో సొల్లు డిస్కషన్ ఎందుకు అంటూ పునర్నవి రెచ్చిపోయింది.సెన్స్ లెస్ ఆర్గ్యుమెంట్ చేసే అలాంటి వెధవతో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ కామెంట్లు చేసింది. వాడు ఎప్పుడైనా తన ఒపీనియన్‌ని చెప్పాడా? వెటకారంగా నవ్వుతాడు ప్రతిదానికి. 31 ఏళ్లు ఉన్న వాడు ఇలా ప్రవర్తిస్తాడా..? అంటూ పునర్నవి చెలరేగిపోయింది. కూల్ డౌన్ అంటూ రాహుల్, వితికా, వరుణ్‌లు ఆపినా పునర్నవి శాంతించలేదు. మరోవైపు శ్రీముఖి, బాబా భాస్కర్‌ల మధ్య నామినేషన్స్‌పై సీరియస్ డిస్కషన్ జరిగింది.