Bigg Boss 10 Telugu : మాకేం పని లేదనుకుంటున్నావా.. ? కంటెస్టెంట్ పై అభిజిత్ సీరియస్.. అగ్ని పరీక్ష ప్రోమో చూశారా.. ?
బుల్లితెర అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 షో వచ్చేస్తుంది. అంతకు ముందు మొదలయ్యే సామాన్యుల అగ్నీ పరీక్ష ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. అయితే అందులో శ్రీముఖితోపాటు అభిజిత్ సైతం కొందరు కంటెస్టెంట్స్ పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు కొందరికి ముఖం మీదనే రెడ్ కార్డ్ చూపించినట్లు కనిపిస్తుంది.

బుల్లితెరపై ఇప్పటికే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న షో బిగ్ బాస్. తొమ్మిది సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈషో.. ఇప్పుడు 10వ సీజన్ స్టార్ట్ కాబోతుంది. అయితే అంతకు ముందు కామన్ కేటగిరి కింద సామాన్యులను ఎంపిక చేసే అగ్ని పరీక్ష సైతం స్టార్ట్ కాబోతుంది. స్మాల్ స్క్రీన్ పై సరికొత్త సంచలనం సృష్టించడానికి బిగ్ బాస్ అగ్నిపరీక్ష (సీజన్ 2) సిద్ధమైంది. ఈ రియాలిటీ షో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతోంది. ఈ కొత్త సీజన్ ఆగస్టు 15 నుండి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈసారి “బిగ్ బాస్ అగ్నిపరీక్ష” లో పోటీదారులు తమ నైపుణ్యాలను, ప్రతిభను , వ్యూహాలను నిరూపించుకోవాల్సి ఉంటుందని ప్రోమో చూస్తే అర్థమవుతుంది. తాజాగా విడుదలైన ఈ ప్రోమోలో ఎప్పటిలాగే నవదీప్, బిందు మాధవి, అభిజిత్ ముగ్గురూ జడ్జీలుగా వ్యవహరిస్తుండగా.. శ్రీముఖి హోస్టింగ్ చేస్తుంది. అయితే విభిన్న రకాల పోటీదారులను , వారిలోని ప్రతిభను పరిశీలిస్తూ కనిపించారు. మొత్తం 70 మంది అగ్ని వారియర్స్ (Agni Warriors) తమ ప్రతిభను ప్రదర్శించి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నాం.. అప్పుడే విడిపోవాలని అనుకున్నాం.. టాలీవుడ్ నటి..
ప్రోమో మొదట్లోనే ఒకరు బాడీబిల్డింగ్ అండ్ ఫిట్‌నెస్ స్కిల్స్ చూపిస్తే.. మరొకరు కుడి నుండి ఎడమకు రివర్స్ లో తెలుగు రాసి న్యాయ నిర్ణేతలను ఆశ్చర్యపరిచారు. గ్రామాలలో జానపద పాటలు పాడుతూ వ్యవసాయం చేసే అమ్మాయి తన కథతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆమెకు వెంటనే గ్రీన్ ట్యాగ్ ఇచ్చాడు నవదీప్. దీనితో పాటు డ్యాన్స్ ప్రదర్శనలు, ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లు, సరదా సంభాషణలతో ప్రమో ఎంతో ఆసక్తికరంగా సాగింది. జడ్జిలు కూడా పోటీదారుల ప్రదర్శనలను అంచనా వేస్తూ గ్రీన్ సిగ్నల్ , రెడ్ సిగ్నల్స్ ఇవ్వడం కనిపిస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..
చివరగా ఒక కుర్రాడు జడ్జీ సీటులో కూర్చున్న అభిజిత్ కు కౌంటర్ వేశాడు. గెలిచిన తర్వాత రెండేళ్లు ఎక్కడ కనిపించకుండా పోయాడు అంటూ పరువు తీసేలా మాట్లాడాడు. దీంతో హర్ట్ అయిన అభిజిత్ ఏం మాట్లాడుతున్నావు.. మాకేం పనిలేదనుకున్నావా అంటూ సీరియస్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరలవుతుంది. ఇదిలా ఉంటే అగ్ని పరీక్ష షో ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం కానుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..
అగ్ని పరీక్ష్ ప్రోమో..
ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..
