KGF Chapter 2 : దక్షిణాదితో పాటు ఉత్తరాది సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ ఒకటి. కన్నడ రాక్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఇది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జులై 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే యశ్ తో పాటు ఈ సినిమాలో పలువురు ప్రముక బాలీవుడ్ స్టార్స్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాలో కీలకమైన అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్న విషయం తెల్సిందే. అయితే అత్యంత క్రూరమైన పాత్ర అధీరాగా సంజయ్ దత్ కనిపించబోతున్నాడు. ఈ సినిమా లో ఓ భారీ ట్వీట్ ఉండనుందట.. అదేంటంటే క్లైమాక్స్ లో హీరో పాత్ర చనిపోతే విలన్ అధీరా హీరోగా మారుతాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. హీరో పాత్రను అత్యంత విభిన్నంగా ముగించి విలన్ పాత్రను హీరోగా మార్చనున్నారంటూ కన్నడ ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :
Superstar Rajinikanth : మరోసారి ఆ దర్శకుడితో సూపర్ స్టార్ సినిమా.. త్వరలోనే సెట్స్ పైకి..