2019 రివైండ్ః ప్రేక్షుకులను విసిగించి.. షాక్ ఇచ్చిన తెలుగు సీరియల్స్ లిస్ట్!
బుల్లితెర ప్రేక్షకులకు 2019 కనువిందు చేసిందని చెప్పాలి. ఎన్నో ఫిక్షనల్, నాన్ ఫిక్షన్ షోస్ అభిమానులకు విపరీతమైన ఎంటర్టైన్మెంట్‌ను అందించాయి. కొన్ని ఫిక్షనల్ సీరియల్స్ అసాధారణమైన కథలను అందిస్తే.. మరికొన్ని నాన్- ఫిక్షన్ షోలు దేశం దృష్టిని ఆకర్షించడం విశేషం. మరి 2019 సంవత్సరంలో ప్రేక్షకులను అలరించినవి.. నిరాశపరిచిన టీవీ కార్యక్రమాలేంటో ఇప్పుడు చూద్దాం.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3… అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ మూడవ సీజన్ అత్యధిక టీఆర్పీ […]
బుల్లితెర ప్రేక్షకులకు 2019 కనువిందు చేసిందని చెప్పాలి. ఎన్నో ఫిక్షనల్, నాన్ ఫిక్షన్ షోస్ అభిమానులకు విపరీతమైన ఎంటర్టైన్మెంట్‌ను అందించాయి. కొన్ని ఫిక్షనల్ సీరియల్స్ అసాధారణమైన కథలను అందిస్తే.. మరికొన్ని నాన్- ఫిక్షన్ షోలు దేశం దృష్టిని ఆకర్షించడం విశేషం. మరి 2019 సంవత్సరంలో ప్రేక్షకులను అలరించినవి.. నిరాశపరిచిన టీవీ కార్యక్రమాలేంటో ఇప్పుడు చూద్దాం..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3…
అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ మూడవ సీజన్ అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ సొంతం చేసుకుంది. ఈ రియాలిటీ షో ప్రారంభానికి ముందే వార్తల్లో నిలిచింది. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తర్వాత హోస్టుగా నాగార్జునకు కమ్‌బ్యాక్ షో కాగా.. హీరో వరుణ్ సందేశ్ కూడా ఈ షో ద్వారానే మళ్ళీ తెరపైకి వచ్చాడు. మూడు నెలల పాటు సస్పెన్స్, ట్విస్టులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఈ షో.. చివరికి వచ్చేసరికి ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇక గ్రాండ్ ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా హాజరు కావడంతో ఆ ఎపిసోడ్ ఒక్కటే అత్యధిక రేటింగ్స్ సంపాదించింది. కాగా, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్‌గా, యాంకర్ శ్రీముఖి రన్నరప్‌గా నిలిచారు.
వదినమ్మ…
వదినమ్మ.. మే మొదటి వారంలో మొదలైన ఈ షో.. అనధికాలంలోనే టాప్ 5 షోస్‌లో చోటు సంపాదించింది. క్రమేపి వ్యూవర్‌షిప్‌ను కూడా పెంచుకుంటూ తెలుగు రాష్ట్రాల మహిళల నీరాజనాలు పొందుతోంది. ఇక కథ విషయానికి వస్తే.. తన ముగ్గురు బావమరుదుల కోసం మాతృత్వాన్ని త్యాగం చేసే సీతా అనే మహిళ చుట్టూ కథ మొత్తం తిరుగుతుంది. ఫార్ములా పాతదైనా.. స్క్రీన్‌ప్లే వైవిధ్యంగా ఉండటంతో కుటుంబ ప్రేక్షకులకు ఈజీగా చేరువైంది. కాగా, ఈ సీరియల్ ద్వారా నటి సుజిత చాలా రోజుల తర్వాత మళ్ళీ బుల్లితెరపై ప్రత్యక్షమైంది.
స్టార్ మ్యూజిక్ గేమ్ షో…
స్టార్ మాలో ప్రసారమయ్యే ఈ షో కొంచెం కొత్తగా ఉంటుందని చెప్పాలి. అదే ఛానల్‌లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్‌లోని నటీనటులు మ్యూజికల్ చైర్స్ రూపంలో టైటిల్ గెలవడానికి సర్వశక్తులు ఒడ్డుతారు. షో మొదటి సీజన్‌కు ఝాన్సీ యాంకర్ కాగా.. బెంగాలీ, మలయాళం వెర్షన్స్‌ను స్టార్ మ్యూజిక్ టెలికాస్ట్ చేస్తుండగా.. ఈ షో రెండో సీజన్ ద్వారా బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రన్నరప్ యాంకర్ శ్రీముఖి కమ్‌బ్యాక్ కానుంది.
పరివార్ లీగ్…
సీనియర్ యాంకర్ ఝాన్సీ హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ నాన్-ఫిక్షనల్ ‘పరివార్ లీగ్’ షోలో అదే ఛానల్‌లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్‌లోని నటీనటులు పోటీపడుతుంటారు. కొత్త కాన్సెప్ట్‌తో మొదలైన ఈ షో ఆసక్తికరంగా ఉన్నా.. ఆయా నటీనటుల సీరియల్స్‌ను ప్రమోట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పాలి. తాజాగా ఈ సిరీస్ సెకండ్ సీజన్ లాంచ్ కాగా.. ఝాన్సీనే మళ్ళీ హోస్టుగా వ్యవహరిస్తోంది.
గోరింటాకు…
ఈ సీరియల్‌లో లీడ్ క్యారెక్టర్స్ శ్రీవల్లి, పార్థులు. వీరిద్దరి మధ్య నడిచే ప్రేమాయణమే ఈ కథ మూలం. వితంతువు అయిన శ్రీవల్లి.. రౌడీ పార్ధుతో ప్రేమలో పడుతుంది. శ్రీవల్లికి ఫ్యామిలీ అనేది మొదటి ప్రయారిటీ. ఇక ఈ సీరియల్‌కు మధ్యతరగతి వాళ్ళు, కుటుంబ ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకున్నారు. అందుకే ఇది కాస్తా ప్రస్తుతం టాప్ 3లో స్థానం ఉండటమే కాకుండా టీఆర్పీ రేటింగ్స్ అదరగొడుతోంది.
హీరోస్…
మంచు లక్ష్మీ హోస్టుగా వ్యవహరించిన ఈ సాహసోపేతమైన రియాలిటీ షో.. 2019లో అత్యంత ప్లాప్ షోగా పేరుగాంచింది. అధికశాతం థాయిలాండ్‌లో చిత్రీకరణ జరుపుకున్నా.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3కి పోటీగా నిలవలేకపోయింది. ఎక్స్-రోడీస్ కంటెస్టెంట్ మిలింద్ చాంద్వాణి, జబర్దస్త్ రామ్ ప్రసాద్, తేజస్వి మడివాడ, విద్యుల్లేఖ రామన్ వంటి ఎందరో చెప్పుకోదగ్గ నటీనటులు ఉన్నా కూడా ఈ రియాలిటీ షో ప్రేక్షకులను నిరాశపరిచింది.
ప్రేమ్ నగర్…
2019లో ప్రారంభానికి ముందే ఈ షో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. సీనియర్ నటి వాణిశ్రీ ఈ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం కావడం కూడా దీనికి ఒక కారణం. అయితే ఈ ఫ్యామిలీ డ్రామా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది.
కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా సీజన్ 4…
యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్టుగా వ్యవహరించిన ఈ షో వన్ అఫ్ ది సక్సస్‌ఫుల్ చాట్ షోస్ ఇన్ టెలివిజన్ అని చెప్పొచ్చు. రీసెంట్‌గా దీని ఫోర్త్ సీజన్ లాంచ్ కావడం అదీ కూడా బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభ సమయంలోనే కావడంతో టీఆర్పీ రేటింగ్స్ అత్యంత తక్కువగా నమోదయ్యాయి. అంతేకాకుండా ప్రదీప్‌కు గాయం కావడంతో అర్ధాంతరంగా షో ఆగిపోవాల్సి వచ్చింది.
సూపర్ సింగర్…
సూపర్ సింగర్ తాజా సీజన్ మోస్ట్ డిస్సపాయింటింగ్ షోస్ అఫ్ ది ఇయర్ అని చెప్పొచ్చు. స్టార్ సంగీత దర్శకుడు థమన్ జడ్జ్‌గా వ్యవహరించినా.. బుల్లితెర ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.