తమిళ ‘అర్జున్ రెడ్డి’కి కొత్త హీరోయిన్ కన్ఫర్మ్

కొన్ని కారణాల వలన బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’.. విడుదల అవ్వకుండానే ఆగిపోయింది. దీంతో మరోసారి సినిమా మొత్తాన్ని రీ షూట్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కొత్త టీమ్‌తో అర్జున్ రెడ్డిని తెరకెక్కిస్తామని చెప్పిన వారు.. హీరో మినహా అందరినీ మార్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్‌ను ఎంపిక చేశారు CONFIRMED… #October leading lady Banita Sandhu to star in #Tamil remake of #ArjunReddy… Dhruv Vikram, […]

తమిళ ‘అర్జున్ రెడ్డి’కి కొత్త హీరోయిన్ కన్ఫర్మ్

Edited By:

Updated on: Feb 16, 2019 | 11:02 AM

కొన్ని కారణాల వలన బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ ‘వర్మ’.. విడుదల అవ్వకుండానే ఆగిపోయింది. దీంతో మరోసారి సినిమా మొత్తాన్ని రీ షూట్ చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. కొత్త టీమ్‌తో అర్జున్ రెడ్డిని తెరకెక్కిస్తామని చెప్పిన వారు.. హీరో మినహా అందరినీ మార్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్‌ను ఎంపిక చేశారు


బాలీవుడ్ చిత్రం ‘అక్టోబర్’లో నటించిన బానిటా సందు ఈ చిత్రంలో ధృవ్ సరసన నటించనుంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. బాలా తెరకెక్కించిన ‘వర్మ’లో మేఘా చౌదరి నటించగా.. ఆమెను మార్చేశారు. ఇక ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి డైరక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన గిరీషయ్య దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.