బాలయ్య చేసిన ఆ వ్యాఖ్యలు జగన్‌ని ఉద్దేశించినవేనా..?

| Edited By:

Dec 15, 2019 | 2:03 PM

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ రూలర్ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక శనివారం వైజాగ్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎంతో మంది ప్రశంసించారు. తెలుగు భాష అనే నేను చెవికోసుకుంటా అంటూ బాలయ్య […]

బాలయ్య చేసిన ఆ వ్యాఖ్యలు జగన్‌ని ఉద్దేశించినవేనా..?
Follow us on

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ రూలర్ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక శనివారం వైజాగ్‌లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎంతో మంది ప్రశంసించారు. తెలుగు భాష అనే నేను చెవికోసుకుంటా అంటూ బాలయ్య కామెంట్లు చేశాడు. ఇది పక్కన పెడితే.. ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా రూలర్ నుంచి రెండో ట్రైలర్ విడుదలైంది. అందులో బాలయ్య పలికిన కొన్ని డైలాగ్‌లు జగన్‌ను ఆయన సర్కార్‌ను టార్గెట్ చేసినట్లు ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా ‘‘పదవి అంటే నువ్వు చదివిన డిగ్రీ అనుకుంటున్నావా’’.. ‘‘చచ్చే వరకు నీ వెంట రావడానికి.. ఎలక్షన్ ఎలక్షన్‌కు పవర్ కట్ అవుతుందిరా పోరంబోకు’’ అంటూ వచ్చిన కొన్ని డైలాగ్‌లు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినవేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు మద్యపానంపైనా కొన్ని డైలాగ్‌లు ట్రైలర్‌లో కనిపించాయి. ‘‘గ్లోబ్‌ను గోలీలా చుట్టి ప్రపంచంతో ఆడుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నీకు తాగుబోతుల్లా కనిపిస్తున్నారా..?’’ అన్న డైలాగ్‌ కూడా జగన్ సర్కార్‌ను ఉద్దేశించి వేసినదే అన్న టాక్ వినిపిస్తోంది. అయితే గతంలోనూ బాలయ్య నటించిన పలు సినిమాల్లో మరొకరిని ఉద్దేశించి వేసిన సెటైర్లు చాలానే ఉన్నాయి.

కాగా ఈ చిత్రంలో బాలయ్య సరసన వేదిక, సోనాల్ చౌహాన్‌లు నటించారు. ప్రకాష్ రాజు, జయసుధ, భూమికా, షియాజీ షిండే, పరాగ్ త్యాగీ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. సి. కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందించాడు. ఈ ఏడాది ప్రారంభంలో బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్(మహానాయకుడు, కథానాయకుడు)తో ప్రేక్షకులను ముందుకు రాగా.. ఆ చిత్రాలు దారుణ పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రూలర్ చిత్రంపై అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.