The Kashmir Files: సినిమా చూడమంటూ సర్కారు ఉద్యోగులందరికీ హాఫ్‌ డే లీవ్‌.. ఎక్కడో తెలుసా?..

|

Mar 16, 2022 | 1:31 PM

1990 నాటి కశ్మీర్ పండిట్ల ఊచకోత, వలసల నేపథ్యంలో తెరకెక్కిన ది కశ్మీర్‌ ఫైల్స్‌ (The Kashmir Files) దేశమంతా సంచలనాలు సృష్టిస్తోంది.

The Kashmir Files: సినిమా చూడమంటూ సర్కారు ఉద్యోగులందరికీ హాఫ్‌ డే లీవ్‌.. ఎక్కడో తెలుసా?..
The Kashmir Files
Follow us on

1990 నాటి కశ్మీర్ పండిట్ల ఊచకోత, వలసల నేపథ్యంలో తెరకెక్కిన ది కశ్మీర్‌ ఫైల్స్‌ (The Kashmir Files) దేశమంతా సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన చోటల్లా కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న ఈ చిత్రంపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) సైతం ‘ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తప్పకుండా వీక్షించాలి’ అని సూచించడం ది కశ్మీర్‌ ఫైల్స్‌కు ఉన్న క్రేజ్‌కు అద్దం పడుతోంది. అంతేకాదు ఇటీవల జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలోనూ ఈ సినిమా చూడాలంటూ ఎంపీలకు, బీజేపీ నాయకులకు సూచించాడు. కాగా ఇప్పటికే హరియణా, మధ్య ప్రదేశ్, గుజరాత్‌, కర్ణాటక, గోవా, ఉత్తర ప్రదేశ్‌, తదితర రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారు. మరికొన్ని రాష్ట్రాలు కూడా అదేబాటలోనే ఉన్నాయి.

నిన్న పోలీసులు.. నేడు ఉద్యోగులు..

ఇదిలా ఉంటే ఇటీవల ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా చూడడం కోసం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని పోలీసులకు ప్రత్యేక సెలవును మంజూరు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ముందడుగేసిన అస్సాం ఈ సినిమాను చూడమని తమ ప్రభుత్వ ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించింది. ఇందుకోసం హాఫ్‌డే లీవ్‌ ప్రకటించింది. సినిమా చూసిన తదుపరి రోజు తమ పై అధికారికి సినిమా టికెట్‌ చూపించి, లీవ్‌ అప్లై చేస్తే హాప్‌డే లీవ్‌ వర్తిస్తుందని అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. ఇక సినిమా విషయానికొస్తే.. గతంలో తాష్కెంట్ ఫైల్స్‌ తో అందరి దృష్టిని ఆకర్షించిన వివేక్‌ అగ్నిహోత్రి ది కశ్మీర్‌ ఫైల్స్‌ను తెరకెక్కించాడు. అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. టాలీవుడ్‌ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

Also Read:AP News: ఏపీలో నకిలీ థైరాయిడ్ మందుల కలకలం.. అనుమానం రాకుండా దందా.. చివరకు

Holi 2022: హోలీ రంగుల వల్ల ముఖం పాడవకూడదనుకుంటున్నారా?.. అయితే నేచురల్‌ ఫేస్‌ ఫ్యాక్‌లు మీకోసమే..

Children Vaccine: నిర్లక్ష్యం వద్దు.. పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు ..