హీరోయిన్‌గా సినీ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలను పూర్తి చేసుకుంది యోగా బ్యూటీ అనుష్క. పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘సూపర్’ మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. తెలుగు, తమిళంలో దాదాపుగా 40 చిత్రాల్లో నటించింది. కాగా మోస్ట్ బ్యాచురల్ హీరోయిన్ లిస్ట్‌లో ఉన్న అనుష్క పెళ్లి గురించిన పుకార్లు చాలా వినిపించాయి. హీరోలను మొదలుకొని వ్యాపారవేత్త, క్రికెటర్, నిర్మాత ఇలా పలువురితో అనుష్కకు పెళ్లి అంటూ వార్తలు చాలానే వచ్చాయి. వీటన్నింటిని ఆమె ఖండించినప్పటికీ.. ఆ రూమర్లకు చెక్ పడలేదు. మొన్నటికి మొన్న ఓ ప్రముఖ దర్శకుడి కుమారుడుని అనుష్క పెళ్లాడబోతున్నట్లు టాక్ నడిచింది. దీంతో వీటిపై తాజాగా స్పందించారు అనుష్క.
“నా వివాహం గురించి గత కొన్ని రోజులుగా వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అలాంటి పుకార్ల వలన నేను ఇబ్బందిపడను. కానీ నా కుటుంబసభ్యులు బాధపడుతున్నారు. నా పెళ్లి గురించి అందరూ ఇంతలా ఎందుకు మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు. బంధాలను ఎవరూ దాచలేరు. అలాగే నా పెళ్లి విషయాన్ని నేనేందుకు దాస్తా. ఇది చాలా సున్నితమైన విషయం. అందరూ దీన్ని సున్నితంగానే చూడాలి. నా వ్యక్తిగత జీవితంలోకి ఇతరులు చొరబడితే నాకు నచ్చదు. వివాహం అనేది చాలా పవిత్రమైంది. పెళ్లి జరిగిన రోజు తప్పుకుండా అందరికీ తెలుస్తుంది. ఎవర్ని పెళ్లి చేసుకుంటాననే విషయాన్ని నేను బయటకి చెప్పకపోవచ్చు. కానీ వరుడి గురించి నన్ను డైరక్ట్‌గానే అడగొచ్చు. వారికి నేను సమాధానం చెప్తా. అయినా నా పెళ్లి విషయాన్ని మా తల్లిదండ్రులకే వదిలేశా. కచ్చితంగా పెద్దలు కుదిర్చిన పెళ్లినే చేసుకుంటా” అని స్పష్టం చేశారు.
Read This Story Also: తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్లు బంద్..!