AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama Parameswaran: అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్

మలయాళ కుట్టీ అనుపమా పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ సినిమా 'క్రేజీ కల్యాణం'. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకన్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో అనుపమ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Anupama Parameswaran: అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
Anupama Paramwswaran
Basha Shek
|

Updated on: Oct 12, 2026 | 6:04 PM

Share

పేరుకు మలయాళం హీరోయినే అయినా తెలుగింటి ఆడపడుచుగా మారిపోయింది అనుపమా పరమేశ్వరన్. ఇప్పుడు తెలుగులో బిజి బిజీగా ఉన్న హీరోయిన్లలో అనుపమా కూడా ఒకరు. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు సై అంటోందీ అందాల తార. గతేడాది ఏకంగా ఆరు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించింది. ఇప్పుడు క్రేజీ కల్యాణం అనే మరో సినిమాతో మన ముందుకు రానుంది అనుపమ. బద్రప్ప గాజుల తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమతో పాటు నరేష్‌ వీకే, తరుణ్‌ భాస్కర్, అఖిల్‌ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. బూసమ్ జగన్ మోహన్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది. హీరోయిన్ అనుపమ కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది.

కాగా మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమా ‘ప్రేమమ్’ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనుపమా పరమేశ్వరన్. అయితే ఇదే సినిమాతో అనుపమకు మించి క్రేజ్ తెచ్చుకుంది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి. ప్రేమమ్ సినిమా సయమంలో వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రేమమ్ సినిమా గురించి మాట్లాడిన అనుపమ.. సాయి పల్లవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘ప్రేమమ్ సినిమా రిలీజ్ సమయంలో నా వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. ఈ మూవీ నాకు లైఫ్ ఛేంజింగ్ మూమెంట్. అయితే ఆ వయసులోనే నాపై ట్రోల్స్, నెగెటివీటీ వచ్చాయి. చిన్న వయసు కావడంతో వాటిని తట్టుకోలేకపోయాను. నిజం చెప్పాలంటే ప్రేమమ్ రిలీజ్ తర్వాత సాయిపల్లవిని చంపాలనిపించింది.. కోపంతో కాదు.. , ఆ వయసులో నాపై వచ్చిన ట్రోలింగ్ భరించలేక అలా అనిపించింది. సినిమాలో సాయిపల్లవి, మడోన్నా పాత్రలు ప్రేక్షకులపై భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. కానీ నేను మాత్రం సినిమాలో కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపిస్తాను. అందులోనూ 10 నిమిషాలు పాటలే ఉంటాయి. ‘ఆ పాటలు ఆల్రెడీ మనం చూసేసాం కదా.. ఈ 5 నిమిషాల పాత్ర కోసం ఈ అమ్మాయికి ఇంత యాటిట్యూడ్ అవసరమా?’ అంటూ ఆ కాలంలో తనపై విపరీతమైన ట్రోలింగ్ జరిగిందని అనుపమ గుర్తు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us