
చిరంజీవి ‘స్టార్’ ఎప్పుడయ్యారసలు? బహుశా ఇండస్ట్రీ దగ్గర కూడా ఈ ప్రశ్నకు సమాధానం లేదేమో. టైటిల్స్‌లో చిరంజీవి అనే పేరుకు ముందు.. సుప్రీం హీరో, మెగాస్టార్ అనే స్టేటస్ ఎప్పుడొచ్చింది అని అడిగితే.. ఇదిగో ఫలానా సినిమా తరువాత, ఫలానా రికార్డుల తరువాత ‘స్టార్’ ఇమేజ్ వచ్చిందని చెబుతుంటారు కొందరు. ఖైదీ తరువాత చిరంజీవి ఫేట్ మారిపోయిందని, ఘరానా మొగుడు రికార్డులు కొల్లగొట్టిందని.. కొన్ని సినిమా పేర్లు చెప్పి చిరంజీవి స్టేటస్, స్టామినా చెబుతుంటారు. కాని, ఇవేవీ సమాధానాలు కావు. చిరంజీవి ఎప్పుడు స్టార్ అయ్యారో, ఎవరికీ తెలీదంటారు. ఓ ఎగ్జాంపుల్ చెబుతా. ఎన్టీఆర్, ఏఎన్నార్ తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలేందుకు కొందరు వచ్చారు. అప్పట్లో.. ఆ రోజుల్లో.. సూపర్ స్టార్స్ ఎవరయా అని అడిగితే.. కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు.. ఇలా కొందరి పేర్లు చెబుతున్న రోజులవి. సినిమాలంటే వాళ్లవే. రికార్డులంటే వాళ్లవే. జనం థియేటర్లకు క్యూకట్టేదీ వాళ్ల సినిమాలకే. అలాంటి రోజుల్లో.. ఇండస్ట్రీ సూపర్‌స్టార్స్‌గా పిలుచుకుంటున్న టైమ్‌లో కృష్ణ, శోభన్‌బాబు కలిసి నటించిన సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు ముందడుగు. మామూలుగా సింగిల్ హీరో నటించిన సినిమాకే బంపర్ కలెక్షన్ వస్తున్న టైమ్ అది. అలాంటిది కృష్ణ, శోభన్‌బాబు కలిసి నటించిన సినిమా ‘ముందడుగు’. ఆ సమయంలో చిరంజీవి జస్ట్ అప్‌కమింగ్ యాక్టర్.. అంతే. కానీ, విచిత్రం ఏంటో తెలుసా కృష్ణ, శోభన్‌బాబు కలిసి నటించిన సినిమా కంటే కూడా...